నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మే 16: తంబళ్లపల్లె మండలం దిగువ పాలెం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడుగా నాగేంద్ర నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి విలేకరులకు తెలిపారు. శుక్రవారం గ్రామంలో జరిగిన పార్టీ కమిటీ ఎన్నికలలో ఉపాధ్యక్షుడిగా శశి కుమార్ నాయుడు, కార్యదర్శిగా అనిల్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులు తమ ఎన్నికలకు సహకరించిన తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జి దాసరిపల్లి జై చంద్రారెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ కాలా నారాయణ, నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో జయచంద్రారెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పడిన గ్రామ కమిటీ సభ్యులకు టిడిపి మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపి తంబళ్లపల్లె మండలంలో గత వైకాపా పాలనలో చేసిన అవినీతి అక్రమాలు, మన కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించి భవిష్యత్తులో తంబళ్లపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ కాలా నారాయణ, మధు నాయుడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News