నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నమిత న్యూస్ - మదనపల్లి : జనవరి 7వ తేదీన అనంతపురం లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తరలిరండి... ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షులు వరదారెడ్డిగారి నారదరెడ్డి అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఈనెల 7న నిర్వహించే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షులు వరదారెడ్డిగారి నారదరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవధ్యక్షులు వరదారెడ్డిగారి నారదరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు రెడ్డి కులస్తుల ముద్దుబిడ్డ, ఆంగ్లేయులను తరిమికొట్టి, గడగడలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి కె.నాగిరెడ్డి మాట్లాడుతూ ఉద్యమ, పోరాటాలతో రెడ్డి కులస్తుల్లో స్ఫూర్తిని నింపిన ఏకైక నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆయన త్యాగం ఎప్పటికీ మరువలేనిదన్నారు. ప్రజలంతా నరసింహారెడ్డి అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలంటూ నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యంగా విగ్రహావిష్కరణతో పాటు రెడ్డి ఆత్మీయ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మస్తాన్ రెడ్డి, నాయకులు వెంకటశివారెడ్డి, రాఘవరెడ్డి, లక్ష్మీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News