నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగులు - యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కలిచెట్ల రెడ్డి గణేష్ - విస్తృత కార్య క్రమాలతో ప్రజలతో మమేకం - రాజకీయంగా యువత ఉనికిని చాటి చెబుతాం యువశక్తి ని బలోపేతం దిశగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగులు వేయనున్నానని యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కలిచెట్ల రెడ్డి గణేష్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయం పైన ఫౌండేషన్ కుటుంబ సభ్యులతో కలసి చర్చించి, భవిష్యత్తు కార్యాచరణ తో అడుగులు వేసే విధంగా సమాలోచనలు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు సేవా కార్యక్రమాల్లో యువత పాత్ర ను సమాజానికి చాటి చెప్పామని ఇకపై రాజకీయంగా యువ శక్తి పాత్ర ను చాటి చెప్పడానికి సహకరించే రాజకీయ పార్టీ లో చేరడానికి వెనుకాడ బొమన్నారు. ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు తమ పరిధి లో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ముందుకు సాగడం జరిగిందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయాన్ని అందించటం, వారి విద్యాభివృద్ధికి తోడ్పాటు నివ్వడం, అనారోగ్యం తో బాధపడుతున్న పేదలకు తమ వంతు గా వైద్య సేవలు అందించడం, కొంత వరకు ఆర్థికంగా సహాయ చేయడం, అనాధ మృత దేహాలకు అంత్యక్రియలు చేయడం, గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాల్లో ని పేదల పిల్లలు బడికి పంపే విధంగా చైతన్య పర్చడం, తో పాటు బడి బయట పిల్లలను గుర్తించి వారు తిరిగి చదుకొనేలా ప్రోత్సహిస్తూ అవగాహన పెంపొందించడం తో పాటు నీకు కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. తమ సేవలు ఆర్థికంగా పరిమితులోపే ఉండటంవల్ల అనుకున్న లక్ష్యాలను అందుకోలేక పోతున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యువతకు రాజకీయాల్లో అవకాశం ఇచ్చి ప్రోత్సహించే పార్టీలలో చేరే విధంగా ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. యువత కూడా రాజకీయాల్లో రాణించగలిగినపుడు మాత్రమే భవిష్యత్తు కు బాటలు వేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే అభివృద్ధి పలాలు అర్హులైన వారికి అందించడానికి వీలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు.అంతే కాకుండా యువ శక్తి ఫౌండేషన్ సేవలు ను అన్ని ప్రాంతాలకు విస్తరించే ఆలోచన చేస్తున్నామని ఇందుకు భవిష్యత్తు లో సహకరించే పార్టీ తో కలసి ప్రయాణం చేయడానికి వెనుకాడ మన్నారు.
Reporter
Namitha News