నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 10 : తంబళ్లపల్లె మండలం లోని వాహనదారులు రోడ్డు భద్రత నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఏ ఎస్ ఐ నజీర్ భాష సూచించారు. శనివారం ఆయన ఎస్సై లోకేష్ రెడ్డి ఆదేశాల మేరకు తంబళ్లపల్లె, మదనపల్లి ప్రధాన రహదారిలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పలు వాహనాల రికార్డులు పరిశీలించి రికార్డులు లేని రోడ్డు భద్రత నియమాలు పాటించని వారిపై జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులతో మద్యం సేవించి వాహనాలు నడపరాదని, హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణాంతకమని, వాహన లైసెన్స్, రికార్డులు సక్రమంగా కలిగి ఉండాలని లేకపోతే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు తో పాటు జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది లక్ష్మినారాయణ, రాఘవేంద్ర, మణికంఠ లు ఉన్నారు.
Reporter
Namitha News