Thursday, 16 April 2026 08:27:05 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ప్రకృతి వ్యవసాయమే సమాజానికి జీవనాడి - ఏ.పీ. సీఎంఎఫ్ మేనేజర్ వెంకట మోహన్

Date : 10 October 2025 11:24 PM Views : 113

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - అక్టోబర్ 10 : నేటి ఆధునిక యుగంలో ప్రకృతి వ్యవసాయం తో పండించిన పంటల ఫల సాయంతో ఆరోగ్యంతో పాటు పర్యావరణం పరిరక్షణ జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ సి ఎం ఎఫ్ ప్రాజెక్ట్ జిల్లా మేనేజర్ వెంకట్ మోహన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఐకెపి కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో జీవవైవిద్య పంటల సాగు పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్ మాట్లాడుతూ రబీ సీజన్లో ఆర్ డి ఎస్ పద్ధతిలో పలు రకాల పంటలు జీవ వైవిధ్య పద్ధతిని అనుసరించి పెట్టుకోవాలని తద్వారా మొక్కకు కావలసిన పోషకాలు అంది వ్యవసాయ భూమి గొల్ల భారి భూమిలో కర్బ నన్ శాతం పెరుగుతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకంతో పంటలు పండించి సత్ఫలితాలు రాబట్టాలన్నారు. రైతులకు ప్రకృతి వ్యవసాయంతో వరి, సామలు, కొర్రలు, సజ్జ, జొన్న, మినుములు, పెసలు,కాయగూరలు, ఆకుకూర, దుంపల పంటలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎర్రసానిపల్లి వద్ద జీవ వైవిధ్య పంటల సాగు లో ఏర్పాటుచేసిన ఫుడ్ బాస్కెట్ పరిశీలించి వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తి పెంపుకు కిచెన్ గార్డెన్స్ కిడ్స్, ఆర్ డి ఎస్ కిడ్స్ కోసం వివో ల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తామని ఏపిఎం గంగాధర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఏలు పవన్, రమణ నాయక్, చిరంజీవి, ఎన్ ఎఫ్ ఎఫ్ రుక్మిణి, ఎంటి రఘునాథ్, తంబళ్లపల్లి యూనిట్ ఇంచార్జ్ రాజు, సిబ్బంది నిజాముద్దీన్, రెడ్డప్ప, సుగుణమ్మ, సిద్ధమల్లు, అర్షియా భాను, సుజాత, సుకన్య, పద్మజ, సునీత రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :