నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి.కొత్తకోట - జూన్ 02 : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు,అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు,గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని, సూపర్ సిక్స్ హామీలు అమలుపరచాలనే డిమాండ్ల మీద,రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనా కార్యక్రమాల్లో భాగంగా, సిపిఐ బి కొత్తకోట మండల సమితి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట "ధర్నా" కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి,ఎఐటియుసి మండల కార్యదర్శి జి.రఘునాథ్ లు మాట్లాడుతూ;మేము అధికారంలోకి వస్తే పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు,పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం అనువైన చోట ఇస్తామని,ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత,ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబునాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఎడాది పూర్తి అవుతున్నా కూడా ఇంతవరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు.మొదటి దశ ఉద్యమంలో భాగంగా సిపిఐ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పేదలను సమీకరించి సచివాలయాలు,మండల కార్యాలయాలు,జిల్లా కలెక్టరేట్ల లో పెద్ద ఎత్తున ఇంటి స్థలాల కొరకు అర్జీలు సమర్పించామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పేదల పట్ల శ్రద్ధ చూపక కాలయాపన చేస్తున్నందుకు నిరసనగా మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు.ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సాయం ఐదు లక్షలకు పెంచాలని,ఇసుక,ఇటుక,సిమెంటు,స్టీలు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బి.కొత్తకోట సర్వే నెంబర్ 1868/2,3 నందు 2013 సంవత్సరంలో 42 మంది పేదలకు రెవిన్యూ అధికారులు ఇంటినివేశ స్థలాలు మంజూరు చేశారని,సదరు లబ్ధిదారులకు స్థలాలు చూపడంలో అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో, సదరు భూమిని అధికార పార్టీకి చెందిన నాయకులు కాజేయాలని చూస్తున్నారని ఆవేదన చెందారు.ఇప్పటికైనా లేవని అధికారులు శ్రద్ధచూపి సదరు లబ్ధిదారులకు స్థలాలు చూపాలని,గత వైసీపీ ప్రభుత్వంలో బి.కొత్తకోట పట్టణంలో 1000 మందికి పైగా పట్టాలిచ్చి,స్థలాలు చూపించడం మరిచారని, వారందరికీ వెంటనే ఇంటి స్థలాలు చూపించాలని, గత సంవత్సరం నవంబర్ నెలలో బి కొత్తకోట మండల కార్యాలయం మరియు బీరింగి గ్రామ సచివాలయాలలో 600 లకు పైగా పేదలు ఇచ్చిన అర్జీలను తక్షణమే విచారించి ఆన్ లైన్ నందు నమోదు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం మండల తహసిల్దార్ మహమ్మద్ అజారుద్దీన్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ,ఎఐటీయూసీ నాయకులు జీ.నారాయణస్వామి,పి.మంజునాథ్,కే.రామంజులు,పి.నారాయణస్వామి,జి.శంకర,జి.ఎం.భాషా,వెంకటరమణ,నాగరాజు,సోము,రమేష్,ప్రభావతి,నీలావతి, చంద్రావతి,సరస్వతి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News