నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వైసిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి ఆత్మీయ ఆహ్వానం మేరకు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి కుమారుడు అనురాగ్ రెడ్డి వివాహ వేడుకకు పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోకలసి హాజరైన నిస్సార్ అహమ్మద్... వైసిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి ఆత్మీయ ఆహ్వానం మేరకు అయన సోదరుడు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి కుమారుడు అనురాగ్ రెడ్డి వివాహ వేడుకకు మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ హాజరైనారు. ఈ వివాహ వేడుకలకు పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, శివ ప్రసాద్ రెడ్డి, గుడివాడ అమర్‌నాథ్ హాజరైనారు. పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, తలశిల రఘురాం, శ్రీకాంత్ రెడ్డి నిస్సార్ అహమ్మద్ ను ఆత్మీయంగా పలకరించారు. రిసెప్షన్ సందర్భంగా వేదికపైకి వెళ్ళి నూతన వధూవరులు వర దీక్షిత రెడ్డి, అనురాగ్ రెడ్డి లను నిస్సార్ అహమ్మద్ దీవించి, శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహ వేడుకలకు హజరైన వైసిపి అగ్ర నాయకులు సన్నిహితులు, శ్రేయోభిలాషులతో నిస్సార్ అహమ్మద్ ముచ్చటించారు. పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిస్సార్ అహమ్మద్ ను ఆత్మీయంగా పలకరించి, మదనపల్లె నియోజకవర్గంలో పార్టీ శ్రేణిలతో కలసి పని చేస్తున్న తీరును అభినందించారు. మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ తోపాటు పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News