నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబలకోట, ఏప్రిల్ 9: జిల్లా సహాయ బాలికా అభివృద్ధి అధికారి శ్రీమతి బి.శిరీష బుధవారం అన్నమయ్య జిల్లా, కురబలకోటలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె 9వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి, ‘ముందుచూపు’ కార్యక్రమం సంబంధించి నోటు పుస్తకాలు పరిశీలించారు . విద్యార్థులు ఈ కార్యక్రమంలో చూపిన చొరవను ఆమె అభినందించారు.ఆమె స్కూల్ స్టోర్ రూమ్‌ను పరిశీలించి, స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేసి, నిల్వల నిర్వహణ సక్రమంగా ఉన్నదని నిర్ధారించారు. అంతేగాక, వంటగది శుభ్రత, పాఠశాల ఆవరణ పరిశుభ్రతను పరిశీలించి, విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం అవసరమని పేర్కొన్నారు. తర్వాత, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి, పాఠశాల సమగ్రాభివృద్ధికి దోహదపడే విలువైన సూచనలు ఇచ్చారు. విద్యార్థుల ప్రవేశాలను పెంచాల్సిన అవసరం ఉందని, అలాగే వారి ప్రాథమిక జ్ఞానాన్ని మెరుగుపరచే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అనంతరం బాలికల విద్యాభివృద్ధి పట్ల ఉపాధ్యాయుల అంకితభావం కొనసాగించాలని కోరారు. పై కార్యక్రమంలో ప్రిన్సిపల్ రఫియా పర్వీన్, బోధనా సిబ్బంది నిర్మలమ్మ ,ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, శ్రావణి, షబానా, పుష్పలత, సుమలత, రత్నప్రియ, రమణమ్మ , భానుప్రియ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News