Thursday, 15 January 2026 12:01:36 PM
# శ్రీజ డైరీ ఆధ్వర్యంలో రంగవల్లుల తో పులకించిన రెడ్డికోట # బుడి బుడి అడుగుల చిన్నారుల గొబ్బిళ్ళు ఆట # 11 మంది జూదరులు అరెస్ట్,రూ 5900/- స్వాధీనం # నిస్వార్ధమైన ప్రజాసేవకుడు కమ్మల రఘు # సత్ సంఘ్ ఫౌండేషన్స్ తో మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ యం.ఓ.యు. # ధాత్రి ఆనంద నిలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. # వైయస్సార్ టీచర్స్ యూనియన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరించిన నిస్సార్ అహమ్మద్ # వైద్య కళాశాల పిపిపి విధానాన్ని రద్దు చేయాలి - సీపీఐ # స్టోర్ కింగ్ కంపెనీ కి ఎంపికైన విశ్వం విద్యార్థులు # సదుం యస్.ఐ. గా బాధ్యతలు చేపట్టిన విష్ణు నారాయణ # వైద్య కళాశాల లను ప్రవేట్ పరం చేసే జి.ఓ. ప్రతులను భోగి మంటల్లో వేసిన సిపిఐ నాయకులు # రోడ్డు భద్రత పై ద్విచక్ర వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్న ఆర్.టి.ఏ. అధికారులు # ఆత్మకూరు పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు సంక్రాతి శుభాకాంక్షలు - విద్యుత్ ఏ.డి.ఏ. చిన్నస్వామి నాయక్ # డి.ఆర్.డి.ఓ. వేసవికాలం ఇంటర్న్ షిప్ కు ఎంపికైన మిట్స్ విద్యార్థులు # తంబళ్లపల్లి బాధితులకు సి.యం.ఆర్.ఎఫ్. చెక్కులు పంపిణీ చేసిన మదనపల్లి ఎమ్మెల్యే # మదనపల్లి పట్టణం లో 2.5 కోట్ల రూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజలు # తెట్టు లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు, రెండు కేజీ ల గంజాయి స్వాధీనం # మంత్రి మండిపల్లి ని కలిసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు # జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

బొగ్గుగని ద్వారా వెయ్యి కోట్లు రూ రెవెన్యూ రావడంతో రికార్డు రెవెన్యూ వచ్చిన సందర్భంగా కేక్ కట్ చేసిన ఏపిఎండిసి విసి&ఎండి శ్రీ విజి వెంకటరెడ్డి

Date : 29 December 2023 08:19 PM Views : 4774

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి : బొగ్గురంగంలో దూసుకుపోతున్న ఎపిఎండిసి సుల్యారీ బొగ్గుగని ద్వారా రికార్డు సమయంలో రూ.1000 కోట్ల రెవెన్యూ ఎపిఎండిసి కార్యాలయంలో పండుగ వాతావరణం ఉద్యోగుల సమక్షంలో కేక్ కట్ చేసిన సంస్థ విసి&ఎండి వచ్చే ఏడాది రూ.2500 కోట్ల మేర రెవెన్యూ ఆర్జనే లక్ష్యం థర్మల్ వెలుగులకు సుల్యారీ బొగ్గు నిల్వలు 25 శాతం బొగ్గు సూక్ష్మ, చిన్న , మధ్యతరహా పరిశ్రమలకు కేటాయింపు జాతీయ స్థాయిలో విస్తరిస్తున్న ఎపిఎండిసి నాలుగేళ్ళుగా ప్రతిఏటా రెట్టింపు రెవెన్యూ సాధన పలు రాష్ట్రాల్లో మైనింగ్ కార్యకలాపాలకు సన్నాహాలు త్వరలోనే బీచ్ శాండ్, ఐరన్ ఓర్, కోకింగ్ కోల్ ఉత్పత్తి ప్రభుత్వ సహకారంతో ప్రగతిపథంలో దూసుపోతున్న ఎపిఎండిసి అందరి సమిష్టి కృషితోనే ఈ మైలురాళ్లు సాధించాం శ్రీ విజి వెంకటరెడ్డి , వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఎపిఎండిసి.

అమరావతి: 1. మధ్యప్రదేశ్ లోని సుల్యారీలో నిర్వహిస్తున్న బొగ్గుగనిలో బొగ్గు ఉత్పత్తి, విక్రయాల ద్వారా రికార్డు సమయంలోనే ఎపిఎండిసి ఏకంగా రూ.1000 కోట్ల రెవెన్యూ లక్ష్యాన్ని అధిగమించింది. ఉత్పత్తి ప్రారంభించిన రెండో ఏడాదిలోనే అత్యధికంగా రెవెన్యూను సాధించడం పట్ల విజయవాడలోని ఎపిఎండిసి కార్యాయలంలో అధికారులు, ఉద్యోగులు శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విజి వెంకటరెడ్డి ఈ సందర్భంగా ఎపిఎండిసి ఉద్యోగుల సమక్షంలో కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2. గతంలో కేవలం రాష్ట్రలోని మైనింగ్ కార్యకలాపాలకే ఎపిఎండిసి పరిమితమైంది. సీఎం శ్రీ వైయస్ జగన్ గారి ప్రోత్సాహం, గనులశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మార్గదర్శకత్వంలో ఎపిఎండిసి నేడు జాతీయ స్థాయికి తన కార్యకలాపాలను విస్తరించింది. మధ్యప్రదేశ్ లోని సుల్యారీలో బొగ్గుగనుల్లో 2022లో ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించాం. అలాగే అతి త్వరలోనే ఝార్ఖండ్ రాష్ట్రంలోని బ్రహ్మదియాలో కోకింగ్ కోల్ ప్రాజెక్ట్ లో కూడా ఉత్పత్తిని వెలికితీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనితో పాటు మన రాష్ట్రంలో బీచ్ శాండ్, ఐరన్ ఓర్ ఖనిజాల మైనింగ్ కూ కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. 3. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎపిఎండిసి మధ్యప్రదేశ్ లోని సుల్యారీ బొగ్గుగనిలో లో ఈ ఏడాది గరిష్టంగా 5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిద్వారా మొత్తం 1700 కోట్ల మేర రెవెన్యూ సాధించాలనేది లక్ష్యం. అయితే ఇప్పటికే అంటే డిసెంబర్ 28వ తేదీనాటికి ఏకంగా రూ.1000 కోట్ల రెవెన్యూ ఆర్జనను సంస్థ అధిగమించింది. రాన్నున్న మూడు నెలల్లో మిగిలిన లక్ష్యంను కూడా సంస్థ అధిగమిస్తుందని భావిస్తున్నాం. సుల్యారీ బొగ్గు విక్రయాల ద్వారా మొత్తం 1500 కోట్ల రూపాయల రెవెన్యూ రాగా, దానిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేయాల్సిన పన్ను చెల్లింపులు రూ.500 కోట్ల వరకు జరిగాయి. మిగిలిన రూ.1000 కోట్లు తక్కువ సమయంలోనే ఎపిఎండిసి రెవెన్యూగా నమోదు చేసుకుంది. 4. వచ్చే ఏడాది సుల్యారీ బొగ్గుగనిలో 6 మిలియన్ టన్నుల మేర ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీని ద్వారా రూ.2500 కోట్ల వరకు ఎపిఎండిసి రెవెన్యూను ఆర్జిస్తుందని అంచనా. సుల్యారీలో వెలికితీస్తున్న బొగ్గునిల్వలు థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా ప్రజలకు వెలుగులు అందిస్తున్నాయి. ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న బొగ్గు నుంచి 25 శాతం వరకు స్థానికంగా ఉన్న సూక్ష్మా, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేటాయిస్తున్నాం. తద్వారా వాటిని ప్రోత్సహిస్తున్నాం. అలాగే సుల్యారీలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన పాఠశాలను నిర్మించి, విద్యారంగంలో పేరెన్నికగల దయానంద్ ఆంగ్లో వేదిక్ (డిఎవి) ట్రస్ట్ ద్వారా విద్యాబోధన చేయిస్తున్నాం. అలాగే ఆధునిక వసతులతో కూడిన వైద్యశాలను నిర్మించి, హెఎల్ఎల్ సంస్థ ద్వారా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వైద్యసదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చాం. 5. ఎపిఎండిసి జాతీయ స్థాయిలో కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ వంటి ప్రభుత్వరంగ సంస్థల సరసన వాణిజ్యసరళిలో బొగ్గుగనులను నిర్వహించే మూడో సంస్థగా నిలుస్తోంది. త్వరలోనే ఝార్షండ్ లోని బ్రహ్మదియాలో కోకింగ్ కోల్ గనిలో ఉత్పత్తిని ప్రారంభించబోతున్నాం. అలాగే మన రాష్ట్రంలో ఐరన్ ఓర్, బీచ్ శాండ్ మైనింగ్ కు కూడా సన్నాహాలు చేస్తున్నాం. గత నాలుగేళ్ళుగా ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎపిఎండిసి తన కార్యకలాపాలను వివిధ రకాల ఖనిజాల మైనింగ్ కు విస్తరించింది. 6. ప్రతిఏటా ఎపిఎండిసి మెరుగైన పనితీరుతో తన రెవెన్యూను గణనీయంగా పెంచుకుంటోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సంస్థ వార్షిక రెవెన్యూ రూ.434 కోట్లు కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెట్టింపు అంటే రూ.900 కోట్లకు పెంచుకుంది. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరోసారి రెట్టింపు రెవెన్యూను అంటే రూ.1800 కోట్లకు ఆర్జననను పెంచుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.4000 కోట్లకు రెవెన్యూ సాధించాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోంది. దీనిలో ఉద్యోగులు, కార్మికుల సమిష్టి కృషి ఉంది. ఇదే తరహాలో రానున్న రోజుల్లో కూడా ఎపిఎండిసి తన పనితీరును మెరుగుపరుచుకుంటూ, జాతీయ స్థాయిలో అగ్రపథంలో నిలబడుతుందని ఆశిస్తున్నాను. 7. ఈ కార్యక్రమంలో ఎపిఎండిసి సలహాదారు డిఎల్ఆర్ ప్రసాద్, సంస్థ వైస్ ప్రెసిడెంట్లు బిపిన్ కుమార్, రామన్ నారాయణన్, డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డి, జనరల్ మేనేజర్ (ఎఫ్&ఎ) ఆళ్ళ నాగేశ్వరరెడ్డి, డిజిఎం విష్నేశ్ రెడ్డి, గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్లు రవిచంద్, పాపారావు, డిఎం కళావతి, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :