నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 10 : సమాజంలో ఉన్నత స్థితికి చేరుకున్న ప్రతి వ్యక్తి అభివృద్ధికి కారకులు గురువులే అని మండల ఎస్ టీ యూ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ అన్నారు.మండలంలోని కె సి పల్లె జెడ్పీ హైస్కూల్ లో ఆంగ్ల ఉపాధ్యాయుడు గా పనిచేసి పదవీవిరమణ పొందిన దామోదరం ను ఎస్ టీ యూ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ టీ యూ నాయకులు మాట్లాడుతూ దామోదరం తన 29 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు ఉత్తమ విద్య అందించి జిల్లా,నియోజక వర్గం,మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నారని పలువురికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.తాను పనిచేసిన పాఠశాలల్లో విద్యతోపాటు,పాఠశాల మౌలిక వసతులకోసం కృషి చేశారని తెలిపారు.సన్మాన గ్రహీత దామోదరం మాట్లాడుతూ తరగతి గదిలో విద్యాబోధన చేస్తున్నప్పుడు విద్యార్థుల మొహంలో సంతోషం కలిగినప్పుడే ఉపాధ్యాయునికి నిజమైన అవార్డు,రివర్డు అని,తన తండ్రి కోరిక మేరకు ఆంగ్ల భాషా విద్య అభ్యశించినట్లు దామోదరం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ పి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మునస్వామి నాయక్, కస్తూరిబా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ మస్తాన్ భీ,ఉపాధ్యాయ పెన్షన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంగారెడ్డీ,విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీరాముల రెడ్డి,చలపతి, అశ్వత్త నారాయణ,పరిమళ,ఉపాధ్యాయులు శ్రీనాథ్ రెడ్డి,మల్లికార్జున రెడ్డి,నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News