నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 13 : రామసముద్రం మండలం అరికెల పంచాయతీ నందు చిట్టెం వారి పల్లిలో ఇరు కుటుంబాల భూ సమస్యను ఇంతకుముందు ఒకసారి ప్రజాదర్బార్లు అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీకి స్పందించి గౌరవ మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష మరియు అధికారులతో కలిసి పర్యటించి సమస్యను పరిష్కరించి ఇరు వర్గాలతో చర్చలు జరిపిన ఎమ్మెల్యే . రెండు రోజులు కిందట చిట్టెం వారి పల్లి కి చెందిన మోహన్ ఆర్మీ జవాన్ వీడియోలు రూపంలో మా భూమిని కబ్జా చేశారని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు ఆ వీడియో వైరల్ అయినందువలన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష స్పందించి తక్షణమే అధికారులను అక్కడికి పంపించి సమస్యను పరిష్కరించడం పరిష్కరించాలని తెలియజేశారు అక్కడ ఇరు కుటుంబాలు అధికారులు మాట వినకపోవడంతో ఈరోజు ఆర్మీ జవాన్ మోహన్ తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే గారు ఈరోజు మధ్యాహ్నం చిట్టెం వారి పలికి చేరుకొని అధికారులతో మాట్లాడి ఈ సమస్యను మూడు రోజుల్లో పరిష్కరిస్తామని ఊరు మొత్తం సర్వే చేసి ఎవరికి ఎంత భూమి ఉందని కొలిచి వారి వారి భూముల్ని వారికి కేటాయిస్తామని తెలియజేశారు అంతవరకు ఇరువర్గాలు ఏమి మాట్లాడుకోకూడదని హెచ్చరించిన ఎమ్మెల్యే . గ్రామంలో ఈ కుటుంబాల వల్ల ఏదైనా ప్రజలకు ఇబ్బంది వస్తే పోలీసులు తగు చర్యలు తీసుకుంటారని హెచ్చరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష
Reporter
Namitha News