Thursday, 16 April 2026 06:51:43 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

టి.బి. ముక్త్ భారత్ అభియాన్ విజయంతం చేద్దాం

Date : 12 June 2025 03:41 PM Views : 393

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 11 : టి. బి. ముక్త్ భారత్ అభియాన్ ప్రత్యేక క్యాంపెయిన్ ను విజయవంతం చేద్దామని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మరియు టి. బి. పర్యవేక్షకులు ప్రభాకర్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి వారి ఆదేశాల మేరకు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ,టి. బి. పర్యవేక్షకులు ప్రభాకర్ లు మదనపల్లి రూరల్ పరిధిలోని అమ్మచెర్వు మిట్ట లో ఉన్న వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి మరియు భాగ్యలక్ష్మి కన్వీనర్ ల ఆధ్వర్యంలో టి. బి వ్యాధి పై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ (డి. హెచ్. ఈ.ఓ) మాట్లాడుచు టి. బి.ముక్త్ భారత్ అభియాన్ 100రోజుల కార్యక్రమం లో భాగంగా ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి పొగత్రాగు వారిని, మద్యం సేవించు వారిని, గతం లో టి. బి. జబ్బు వచ్చి భాగైన వారిని, హెచ్. ఐ. వి. పాజిటివ్ వారిని, బి. ఎమ్. ఐ 18 కంటే తక్కువ ఉన్న వారిని, గర్భవతులను, షుగర్ ఉన్న వారిని, దీర్ఘాకాలిక జబ్బులు ఉన్న వారిని గుర్తించి వారికి గళ్ళ పరీక్షలు నిర్వహించి, వారికి పాజిటివ్ వచ్చిన యెడల ఆరు నెలల చికిత్స ఉచితంగా ప్రారంభించడం జరుగుతుంది అన్నారు. చికిత్స సమయం లో రోగి ఖాతా లో రు 1000/-జమ చేయడం జరుగుతుంది అన్నారు. మంచి పౌష్టికాహారం తీసుకోవడం కోసం ఈ పైకం వారికి ఇవ్వడం జరుగుతుంది అన్నారు.టి. బి. రోగులకు పౌష్టికాహారం అందించుటకు అనగా వారిని దత్తత తీసుకోవడానికి పోషన్ మిత్రలు ముందుకు రావాలాన్నారు ఇందులో భాగంగా వెలుగు స్వచంద సేవా సంస్థ తరపున 10మంది టి. బి. రోగులకు పౌష్టికాహారం ఇవ్వడానికి దత్తత తీసుకోవడం జరిగింది.. మరియు విభిన్న ప్రతిభావంతుల పాఠశాల విద్యార్థుల కు అవగాహన కల్పించి వారిచే టి. బి. ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం ప్లాకార్డ్స్ ప్రదర్శన చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం లో వెలుగు సోసియల్ వర్కర్ గీత, విభిన్న ప్రతిభావంతుల పాఠశాల ప్రిన్సిపాల్ లీనా కుమారి, టి. బి. యూనిట్ సిబ్బంది సుశీల, వనజ,ఆశ్రమ ఏ. ఎన్. ఎమ్.గీత, కోళ్ల బైలు ఏ. ఎన్. ఎమ్ జ్యోతి, ఎమ్. ఎల్. హెచ్. పి శ్రావణి,, ఆశాకార్యకర్తలు నిస్సి గేసి, రెడ్డి కుమారి పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :