నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 22 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలోని డంపింగ్ యార్డ్(చెత్త సేకరణ కేంద్రం) ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని తంబళ్లపల్లె నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి కొనియాడారు. గురువారం ఆయన ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి తో కలిసి డంపింగ్ యార్డ్ ను పరిశీలించి అందులో వర్మీ కంపోస్ట్ విధానం, మొక్కల పెంపకం, తడి, పొడి చెత్త విభజన నిర్వహణపై ఎంపీడీవో తో పాటు కార్యదర్శి రామకృష్ణ గ్రీన్ అంబాసిడర్లను ప్రశంసించారు. ప్రతి డంపింగ్ యార్డ్ తంబళ్లపల్లె యార్డును ఆదర్శంగా తీసుకొని ఎరువు తయారీ తోపాటు పారిశుధ్యం మెరుగుపై దృష్టి సారించాలన్నారు. అనంతరం తంబళ్లపల్లె పురవీధుల్లో ఇంటింటికి తిరిగి పారిశుధ్యం నిర్వహణ, చెత్త సేకరణ పై ఆరాతీసి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని ప్రతి కార్యదర్శి చెత్త నుండి ఎరువు తయారీ పై దృష్టి సారించి గ్రామాలలోని తడి పొడి చెత్త సేకరణ పై గ్రీన్ అంబాసిడర్లు సహకరించాలన్నారు. ఆయన వెంట కార్యదర్శి రామకృష్ణ, జనసేన మండల నాయకుడు ఎద్దుల నరసింహులు, భాస్కర, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు
Reporter
Namitha News