నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - అక్టోబర్ 28 : తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె చెరువు కురుస్తున్న భారీ వర్షాలకు నిండి మొరవ పోయింది. ఈ చెరువు మొరవ జిల్లా పరిషత్ హై స్కూల్ కు సమీపంలో ఉంది. పాఠశాల విద్యార్థులు ఈ చెరువు వైపు వెళ్ళకుండా స్థానిక ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించాలని ఎంపీడీవో పట్నాయక్, ఎం ఈ ఓ త్యాగరాజు, డిప్యూటీ ఎంపీడీవో ఈశ్వర్ రెడ్డి లు సూచించారు. నిండిన చెరువు దగ్గర ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు తోపాటు దీప రామా ప్రజలకు సమీప గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలన్నారు.
Reporter
Namitha News