Thursday, 16 April 2026 06:50:17 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ప్రజా దారిని అక్రమంగా మూసివేసిన చర్యను తక్షణమే వెనక్కి తీసుకోవాలి – సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు డిమాండ్

Date : 07 July 2025 06:25 PM Views : 288

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రజా దారిని అక్రమంగా మూసివేసిన చర్యను తక్షణమే వెనక్కి తీసుకోవాలి – సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు డిమాండ్ మదనపల్లి మండలంలోని కొత్తవారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని RCవడ్డిపల్లి గ్రామంలో ప్రజలు నిత్యవసర రాకపోకల కోసం గత 40 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న సార్వజనీన దారిని ఇటీవల B. రెడ్డెప్ప అనే వ్యక్తి తన కుమారుడు B. కుమార్ తో కలిసి అక్రమంగా ప్రహరీ గోడ కట్టి పూర్తిగా మూసివేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సందర్భంగా PL.నరసింహులు మాట్లాడుతూ దారి మూసివేత వల్ల పైభాగంలో ఉన్న ఏడు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పిల్లలు ప్రభుత్వ అంగన్వాడి కేంద్రానికి వెళ్లలేకపోతున్నారు. ప్రజల హక్కులను పక్కన పెట్టి, ఏటువంటి అనుమతులు లేకుండా ఒక వ్యక్తి ఇష్టానుసారంగా ప్రజా ప్రయోజనాలను తృణప్రాయంగా తేలికచేసే ప్రయత్నం చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయం.ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల పక్షాన తక్షణ చర్యలు తీసుకోవాలి. గ్రామ ప్రజలకు న్యాయం జరగాలి అని అన్నారు. సంవత్సరాలు గా కొనసాగుతున్న ప్రజా దారిని అడ్డగించడం అన్యాయమే కాక, న్యాయబద్ధంగా తప్పు. సబ్ కలెక్టర్ గారు వెంటనే పరిశీలన చేసి, ఆ ప్రహరీ గోడను తొలగించాలని, ప్రజల రాకపోకలకు మార్గం కల్పించాలనే డిమాండ్‌ను సిపిఐ తరఫున గట్టిగా ఉంచుతున్నాం. లేకపోతే ఈ వ్యవహారాన్ని ప్రజల సమిష్టి పోరాటంగా మలచడానికి మేం వెనుకాడం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడటానికి సంబంధిత అధికారులు నిబంధనలను అమలు చేయాలని, ప్రజల జీవనోపాధిని కాపాడే విధంగా వ్యవహరించాలని సిపిఐ గా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోపు కృష్ణప్ప , నియోజకవర్గ కార్యదర్శి మురళి, ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్, సిపిఐ సమితి సభ్యులు అంజనప్ప, బాధిత గ్రామస్తులు వై .రమేష్, శ్రీనివాసులు, వెంకటరమణ, అంజనప్ప, రెడ్డి తరుణ్, జగదీష్, సుభద్ర, రమాదేవి, సునీత తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :