నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లె సమీపం లో గల మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగము వారికి పేటెంట్ లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. సివిల్ విభాగము లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కె. అనిత, డాక్టర్ నక్కీరన్ జి, విభాగాధిపతి డాక్టర్. దీపాంకర్ రాయ్ మరియు బి.టెక్ చివరి సంవత్సర విద్యార్ధి ఏ. వైష్ణవి లు గ్రిప్ టైట్ (GRIP-TITE) ఇంటర్‌లాకింగ్ ఇటుకల రూపకల్పన పై పేటెంట్ హక్కులను సంపాదించినట్లు ఆయన అన్నారు. ఈ పద్దతి ద్వారా తయారుచేయబడిన ఒకదానికొకటి సరిపోయే ఇటుకలను గోడలు, తోట పడకలు, మార్గాలు, అంచులు, పునాదులు మరియు అంతర్గత మరియు బాహ్య గోడలను నిలుపుకోవడానికి ఉపయోగించవచ్చు అని ని ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. ఇందులో వివిధ ఆకారాలలో ఇటుకలను తయారుచేసి, మనం నిర్మిచి గోడలకు బలం చేకూరేలా తయారుచేయడానికి ఈ పేటెంట్ ను వాడుతామని, ఈ పద్ధతులు సివిల్ ఇంజనీరింగ్ కొత్త టెక్నాలజీ గా మన కేంద్ర ప్రభత్వం చే గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. పేటెంట్ హక్కులు ను అందుకున్న సివిల్ అధ్యాపకులను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ తదితరులు అభినందనలు తెలియజేసారు.
Admin
Namitha News