Thursday, 16 April 2026 06:50:19 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఫుట్ బాల్ క్రీడలో సత్తాచాటిన శ్రీ విద్యా వికాస్ విద్యార్థి

రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైన వి.కార్తీక్

Date : 01 October 2025 08:48 PM Views : 84

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఫుట్ బాల్ క్రీడలో సత్తాచాటిన శ్రీ విద్యా వికాస్ విద్యార్థి - రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైన వి.కార్తీక్ - అభినందించిన కళాశాల కరస్పాండెంట్ ఇర్రి శివశంకర్ మదనపల్లె : ఫుట్ బాల్ క్రీడలో మదనపల్లి పట్టణంలోని శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికై సత్తాచాటాడు.ఈ నేపథ్యంలో బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్ ఇర్రి శివశంకర్,కోచ్ బాలాజీల ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందజేసి,శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శివ శంకర్ మాట్లాడుతూ మా కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న వి.కార్తీక్ ఎస్.జి.ఎఫ్ జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వకారణన్నారు.మా కళాశాల నందు విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధనతోపాటు క్రీడలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.వి.కార్తీక్ భవిష్యత్తులో జాతీయస్థాయి ఫుట్ బాల్ జట్టుకు ఎంపికై మదనపల్లి,ఏపీ పేరు ప్రతిష్టలు పెంచాలని ఆకాంక్షించారు.అనంతరం కోచ్ బాలాజీ మాట్లాడుతూ ఎస్.జి.ఎఫ్ పుట్ బాల్ పోటీలలో ఉమ్మడి చిత్తూరు జిల్లాల నుండి మదనపల్లె నుండి వి.కార్తీక్ మరియు చిత్తూరు నుండి జాకబ్ అనే విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ జట్టుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు.ఇందుకు పీడీలు అన్వర్ బాషా,నరేష్ కుమార్,మహేంద్ర నాయక్,మురళీధర్,మహేంద్రలు సహకారం ఎంతో ఉందన్నారు.అక్టోబర్ 6వ తేదీ నుండి జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో జరిగే అంతరాష్ట్ర పుట్ బాల్ పోటీలలో ఈ విద్యార్థులు ఏపీ జట్టు తరఫున ఆడుతారన్నారు.ఈ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలలో రాణించి ఉమ్మడి చిత్తూరు జిల్లాల కీర్తిప్రతిష్టలు పెంచాలన్నారు.భవిష్యత్తులో మరింత మందిని ఫుట్ బాల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే తన సంకల్పమన్నారు.అనంతరం విద్యార్థి కార్తీక్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ జట్టుకు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు.తన ఎంపిక వెనుక శ్రీ విద్యా వికాస్ కళాశాల ప్రిన్సిపాల్ శివ శంకర్,అధ్యాపకులు మరియు కోచ్ బాలాజీ కృషి ఎంతో ఉందన్నారు.ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయి పోటీలలో రాణిస్తానని సదరు ధీమా వ్యక్తం చేశాడు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎస్.రెడ్డెప్ప నాయుడు,వై.గుణకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :