Thursday, 16 April 2026 04:48:17 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

తొలి ఏకాదశి ఎంతో విశిష్టమైనది.... మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ వెల్లడి

Date : 06 July 2025 08:30 PM Views : 178

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తొలి ఏకాదశి ఎంతో విశిష్టమైనది.... మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ వెల్లడి... అమ్మచెరువుమిట్ట శేషాచల నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశి ఎంతో విశిష్టమైనదని, ఈ పర్వదినంతోనే పండగలు మొదలవుతాయని మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానం మేరకు తొలి ఏకాదశి పండుగ రోజున మదనపల్లె టౌన్ అమ్మచెరువుమిట్ట శేషాచల నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన కల్యాణోత్సవం, హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమానికి నిస్సార్ అహమ్మద్ హాజరైనారు. ఆలయం వద్ద వైసిపి నాయకులు, స్దానిక ప్రజలు నిస్సార్ అహమ్మద్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందించి, తొలి ఏకాదశి విశిష్టత, ఈ రోజు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిదనే విషయాన్ని సవివరంగా తెలియజేశారు. అనంతరం ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ తొలి ఏకాదశి పవిత్రత, విశిష్టత తెలియజేశారు. హిందువులు ఎంతో పవిత్రతో తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటారని‌, ‌తొలి ఏకాదశి పండుగ నుండి వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయని, హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముందనే విషయాన్ని తెలిపారు. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయని, వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారని, తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఎంతో పుణ్య ఫలం అందిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు, S.V. రమణ, ఎస్.రమేష్ బాబు, మునిశేఖర్, ఫక్రుద్దీన్, మధు, బయారెడ్డి, నర్సింహులు, చెన్న, మల్లికార్జున, యూనస్, యాసిన్, అబ్దుల్లా, సాదిక్, జభి తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :