నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె డిసెంబర్ 26 ః రైతులకు సంబంధించిన భూముల సమస్యల పరిష్కారానికి రైతు సదస్సు ఓ వేదిక గా నిలిచిందని రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ హరిప్రసాద్ సూచించారు. గురువారం మండలంలోని గంగిరెడ్డి పల్లెలో జరిగిన రైతు సదస్సులో రైతులు పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. రైతులు తమ భూములను రెవెన్యూ రికార్డులలో సవరణ చేయాలని, భూముల రీ సర్వే తో ఏర్పడిన సమస్యల పరిష్కారం, ఇంకా పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత రెవెన్యూ అధికారుల సహకారంతో త్వరలో పరిష్కరిస్తామని తాసిల్దార్ హామీ ఇచ్చారు. ఈ సదస్సులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మీసాల భాస్కర్ నాయుడు, డిటి రవీంద్ర, ఆర్ఐ ముద్దుకృష్ణ, సర్వేయర్ నరేంద్ర, దేవాదాయ శాఖ రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట, ఫారెస్ట్ అధికారి రామరాజు, వీఆర్వో భాష, రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News