నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 24: తంబళ్లపల్లె మండలం లోని మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో ఇండియన్ బ్యాంక్ అండగా నిలుస్తుందని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. మంగళవారం ఐకెపి కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ తో కలిసి పలు మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల డాక్యుమెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలతో మాట్లాడుతూ సభ్యులు రుణాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఏపీఎం గంగాధర్ మాట్లాడుతూ ప్రతి సంఘ సభ్యురాలు తీసుకున్న రుణాన్ని సద్వినియోగం చేసుకొని పాడియావులు, గొర్రెలు, చిన్న వ్యాపారాలు చేసుకుని తిరిగి సకాలంలో రుణాలు చెల్లించి బ్యాంకు అభివృద్ధికి సహకరించాలన్నారు. వీరి వెంట సిసిలు రమణ, కత్తి నరసింహులు, ఆదిలక్ష్మి మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News