నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 31 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి లో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో గురువారం రాజ గోపుర మహోత్సవాలలో భాగంగా ఉదయం ఆలయ సూపరింటెండెంట్ ముని బాల కుమార్ ఏఈఓ గోపీనాథ్ సారధ్యంలో ఆగమ అడ్వైజర్ శ్రీనివాస్ చార్యులు, కృష్ణ ప్రసాద్ భట్టార్, కృష్ణరాజు, రమేష్, ధనుష్ స్వాములు ఆలయ ముఖ ద్వారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ మూర్తులకు వేద మంత్రోచ్ఛారణల మధ్య వైదిక కార్యక్రమాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి చతుష్టార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ధ్వజ కుంభ ఆరాధన, హోమ కార్యక్రమాలు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. సాయంత్రం చతుష్టార్చన, జలదివసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది నగేష్, నాగరాజు భక్తులు పాల్గొన్నారు.
Reporter
Namitha News