నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 15 ః గొర్రెను దొంగతనం చేసే ప్రయత్నం చేసిన ముగ్గురు పోలీసుల చేత చిక్కి జైలు పాలయిన సంఘటన తంబళ్లపల్లె మండలంలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం కోలార్ కు చెందిన తిప్పన్న, రాజేష్, ఆశ లు కారు నెంబర్ కే ఏ 53 ఎం 0998లో సోమవారం తెల్లవారుజామున దారి తెలియక గోపి దీన్ని మీదుగా మొలకలచెరువు హైవే రోడ్డుకు చేరుకోవాలని సత్యసాయి జిల్లా ఎన్ పి కుంట మార్గం గుండా తంబళ్లపల్లి మండలం జిల్లా శివార్లలోని ఎద్దుల వారి కోట వద్దకు చేరుకున్నారు. ఆ గ్రామం సమీపంలో ఎద్దుల రెడ్డమ్మకు చెందిన గొర్రెల మంద నుండి ఒక గొర్రెను ముగ్గురు నిందితులు తమ కార్లో వేసుకొని ఉడాయించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కేకలు వేసిన ఆ కారు ఆగకుండా వేగంగా వెళ్ళిపోయింది. గొర్రె చోరీపై రెడ్డమ్మ కుటుంబ సభ్యులు తంబళ్లపల్లె పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై లోకేష్ రెడ్డి సారధ్యంలో పోలీసులు గుండ్లపల్లి వద్ద మాటు వేశారు. ఆ కారు గోపి దిన్ని మీదుగా గుండ్లపల్లి వద్దకు చేరుకోగానే కారును ఆపి కారుతో సహా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఆ ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు విలేకరులకు తెలిపారు. గొర్రె చోరీని అరికట్టిన పోలీసులపై స్థానిక ప్రజలు ప్రశంసలు జల్లు కురిపించారు.
Admin
Namitha News