నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కార ప్రధానోత్సవం - మదనపల్లి విశ్రాంత హెచ్ ఎం మునిగోటి శ్రీనివాస శర్మ కు ఘనంగా సన్మానం ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ, విజయవాడ వారి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2025 ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆం.ప్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ ప్రభుత్వ సలహాదారు, రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ ఆధ్వర్యంలో గుంటూరు బ్రాడీ పేట లోని బ్రాహ్మణ సేవా సమితి భవనము నందు ఘనంగా జరిగింది. బ్రాహ్మణ ఉపాధ్యాయు లందరినీ ఒక వేదికపైకి చేర్చి, వారిని సత్కరించ డానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తొలి ప్రయత్నంగా ఆంధ్ర ప్రదేశ్ నుండి రాష్ట్ర బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అంద చేయాలనే సంకల్పంతో ఈ ఏడాది సత్కరించడం జరిగిందని జ్వాలాపురం శ్రీకాంత్ తెలిపారు. ఈ పురస్కారోత్సవ కార్యక్రమం పోతావఝుల పురుషోత్తమ శర్మ , ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరగ్గా, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం సంగీత విభాగం అధ్యాపకు రాలు డాక్టర్ మంజుల చింతల పాటి, ముఖ్య అథితులు గా ఆచార్య జీ.ఎస్.ఆర్. కృష్ణమూర్తి, ఉప కులపతి, అధ్యాపకులు డాక్టర్ ఎస్.టీ.విష్ణువర్ధన్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయము, తిరుపతి, ఓరుగంటి నవీన్, ఈచంపాటి కృష్ణమాచారి, ఇక్కుర్తి వెంకట్ లు, ఆత్మీయ అథితులుగా కౌతా సుబ్బారావు, బందా రవి, నందిరాజు పాండురంగా రావు, తుళ్ళూరు ప్రకాష్ లు, గౌరవ అథితులుగా మంగళంపల్లి అంజిబాబు, కలిసపాటి లక్ష్మీ నారా యణ, మామిళ్ళపల్లి అయ్యప్ప లు పాల్గొని సన్మాన గ్రహీతలకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె విశ్రాంత ప్రధానోపా ధ్యాయులు మునిగోటి శ్రీనివాస శర్మ కు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అన్నమయ్య జిల్లా నుండి ఏకైక వ్యక్తిగా అందు కున్నారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ గురువు విలువను తెలియచేస్తు అజ్ఞానాంధ కారాన్ని పారద్రోలి విజ్ఞాన జ్యోతిని వెలిగించి సన్మార్గాన్ని చూపిన గురువులు మహోన్నతు లని, అటువంటి గురువులను స్మరించుకొని, పూజించు కోవడమే గురుశిష్య సంబందానికి ప్రతీకని మునిగోటి శ్రీనివాస శర్మ పేర్కొన్నారు.
Reporter
Namitha News