నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఇది మంచి ప్రభుత్వం, సుపరిపాలన అంటూ మళ్ళీ మోసగించడానికి వస్తున్నారు... ప్రజలు వాస్తవాలను గ్రహించాలి -- మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ సూచన -- బాబు ష్యూరిటి మోసం గ్యారెంటీ మదనపల్లె నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం -- ముఖ్య అతిధులుగా జిల్లా అధ్యక్షుడు అమరనాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, సుగవాసి సుబ్రహ్మణ్యం -- సమావేశం సూపర్ సక్సెస్ కూటమి ప్రభుత్వం పాలన గాలికి వదిలేసిందని, ఇచ్చిన హామీలు విస్మరించి గెలిపించిన ప్రజలకు చేసి, మళ్ళీ ధగా చేయడానికి ఇది మంచి ప్రభుత్వం అంటూ వస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ సూచించారు. బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ పేరుతో చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలకు గుర్తుకు చేస్తూ నిర్వహించన మదనపల్లె నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిస్సార్ అహమ్మద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిలుగా తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, సుగవాసి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప మేయర్ సురేశ్ బాబు, రాష్ట్ర కార్యదర్శి అనీషా రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్, మనుజా రెడ్డి, ఎపి ఎండిసి మాజీ చైర్ పర్సన్ షమీమ్ అస్లాం హాజరైనారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కానీ సుపరిపాలన తొలి అడుగు అంటూ ప్రజలను వంచించడానికి మళ్ళీ మీ ఇంటి వద్దకు వస్తున్నారు, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామిలను ప్రజల ముందు వుంచడంలో వైసిపి నాయకులు, కార్యకర్తలదే ముఖ్య పాత్ర అని అన్నారు. కూటమి ప్రభుత్వం పాలన గాలికి వదిలేసిందని, ఇచ్చిన హామీలు విస్మరించి ఐదు కోట్ల మంది ప్రజలకు చేసిన మోసాన్ని ప్రజల ముందు వుంచాలని, స్దానిక సంస్థల ఎన్నికలలో ఒట్లు కోసం వెళ్ళే కూటమి నాయకులను ప్రజలు చీకొట్టడానికి ఇది సరైన కార్యక్రమం అన్నారు. చంద్రబాబునాయుడు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి ప్రజలను వెన్నుపోటు పొడిచారని విమర్శలు గుప్పించారు. మంచి ప్రభుత్వం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గ్రహించే విధంగా ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే కూటమి ప్రభుత్వం భయపడి పోతుందని, ఆంక్షలు విధించి, అక్రమ కేసులు పెడుతుందని అన్నారు. మామిడి రైతులను ఆదుకోవడాని జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం వచ్చినప్పుడు పోలీసుల తీరు కర్ఫ్యూ కంటే దారుణంగా వుందన్నారు. కూటమి పాలనలో మామిడి, టమోటా రైతుల దుస్థితి దారుణంగా ఉందని, ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తోతపూరి మామిడి రకం రోడ్లపక్కన పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ 2.0 లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్. రామచంద్రారెడ్డి, కేశవరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, గెవెన్న, కరుణాకర్ రెడ్డి, S.A. కరీముల్లా, లియాకత్ అలీ, నాగరాజ్ రెడ్డి, దండు శేఖర్ రెడ్డి, శారదరెడ్డి రేవతి, నాగమణి, మహేష్ తోపాటు పెద్ద సంఖ్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News