Thursday, 16 April 2026 08:28:36 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

నిరుద్యోగ సమస్య నిర్మూలనకు మెగా డీఎస్సీ

రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Date : 08 June 2025 02:10 PM Views : 195

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చిన్నమండెం జూన్ 8 : రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చిన్నమండెం మండలం, బోరెడ్డిగారిపల్లెలోని తమ నివాసంలో మంత్రి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ....గతంలో ఉద్యోగాలు లేక ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16,437 టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను నివారించేందుకు చర్యలు చేపడుతుందన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి చాలా మంది నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అర్జీలు సమర్పించారన్నారు. వీరందరికీ జాబ్ మేళాల ద్వారా అర్హత మేరకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. దీంతో ప్రజలు మంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :