నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి నమిత న్యూస్ ఆగస్టు08: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం లోని కొత్తపేట లో నున్న బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో గురువారం విద్యా కమిటీ ఎన్నికలు . నేడు ఎన్నికలల్లో హాజరైన విద్యార్థినుల తల్లిదండ్రులు ఐకమత్యంగా ఛైర్మన్ గా శ్రీమతి K. స్వర్ణలత ను , వైస్ ఛైర్మన్ గా మోడెం రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు . ఈ ఎన్నికలకు విద్యాశాఖ అధికారి సోమశేఖర్ , హెడ్ మాస్టర్ సైరాభాను , ఉపాధ్యాయులు షామీమ్ , బయ్యారెడ్డి, శ్రీమతి రెడ్డిలక్ష్మీ , మాజీ కౌన్సిలర్ ఈశ్వరయ్య , అర్చన విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మదన్ మోహన్ రెడ్డి మరియు విద్యార్థినుల తల్లిదండ్రులు హాజరయ్యారు . ఈ సందర్భంగా చైర్మన్ గా ఎన్నికైన స్వర్ణలత మాట్లాడుతూ స్థానిక మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి సహకారం , ఆదేశాలతో ఉపాధ్యాయుల సహకారం తో విద్యార్థునులకు అన్నీ మౌలిక సదుపాయాలు కల్పన కు ప్రాధాన్యత ఇస్తాం , మధ్యాహ్నం భోజనం పథకం లో మంచి పోషకాహారం అందించేందుకు కృషి చేస్తామని , విద్యార్థునులకు గత ప్రభుత్వం కంటే తెలుగుదేశం ప్రభుత్వం లో మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు .
Admin
Namitha News