నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 24 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను శుక్రవారం డిఎస్పీ ఎస్. మహేంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు . మండల పోలీస్ స్టేషన్ కు విచ్చేసిన డిఎస్పీ, సీఐ లకు ఎస్సై డి రమేష్ బాబు పోలీస్ సిబ్బంది సెల్యూట్ చేసి స్వాగతం పలికారు. డిఎస్పీ రికార్డులను పరిశీలించి పలు కేసుల వివరాలు అడిగి తెలుసు కున్నారు. డిఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక కార్యాక్రమాలకు పాల్పడినా,రౌడీయుజం, అక్రమ మద్యం, గంజాయి ప్రోత్సహించిన ఉపేక్సించేది లేదని డిఎస్పీ హెచ్చరించారు. మండల పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడేందుకు.పోలీస్ సిబ్బంది ముందుంటారన్నారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. జనజీవానికి ఆటంకాలు లేకుండా చూసేందుకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మండలం లోని కర్ణాటక సరిహద్దులోని చెక్ పోస్ట్ వద్ద ప్రత్యేక పోలీస్ లను పెట్టామని డిఎస్పీ,సీఐ తెలిపారు. అక్రమ మద్యం, జూదం పై నిఘా ఉంచామన్నారు.కొత్త వ్యక్తుల రాకపోకలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టామని . ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ లపై ఉందన్నారు. పంచాయతీ సచివాలయాల మహిళా పోలీస్ లతో డిఎస్పీ సమావేశం నిర్వహించి గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉన్నాయా మద్యం, కోడిపందేలు, పేకాట నిర్వహిస్తున్నారా మహిళా పోలీస్ లను అడిగారు . ఎక్కడా బెల్ట్ షాపులు, పేకాట, కోడిపందేలు లేవని డిస్పికి మహిళా పోలీసులు తెలిపారు. ఈతనిఖీల్లో సీఐ సత్యనారాయణ తో పాటు ఎస్సై రమేష్ బాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఎస్సై డి. రమేష్ బాబు డిఎస్పీ ఎస్ మహేంద్ర కు వివరణ తెలియజేశారు.ప్రతిరోజు మా సిబ్బంది తో కలిసి కర్ణాటక భార్డర్ లో తనిఖీ నిర్వహించడం,పలు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమై గ్రామ ప్రజలు ఎలాంటి గొడవలు పెట్టుకోరాదని వారికి సలహాలు ఇస్తున్నామని డిఎస్పీ కి తెలిపారు.ఈ సమావేశంలో డీఎస్పీ మహేందర్, సీఐ సత్యనారాయణ, ఎస్సై డి. రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది, సచివాలయం మహిళా పోలీస్ లు పాల్గొన్నారు.
Admin
Namitha News