నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జూన్ 14 : వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ మద్యపానం సేవించకుండా , రహదారి భద్రత నియమాలు పాటించి వాహనాల నడపాలని రామసముద్రం ఎస్‌ఐ రమేష్ బాబు అన్నారు. శనివారం రామసముద్రం మండల కేంద్రంలో రహదారి భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాహనాన్ని రహదారి భద్రతా నియమాలు పాటించి నడపాలని, ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వేగం కన్నా ప్రాణం మిన్న అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
Namitha News