Thursday, 16 April 2026 06:45:20 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

బోయకొండ చైర్మన్ బీసీ సామాజిక వర్గానికే ఇవ్వాలి

బోయకొండ బీసీలకొండ - ఓ బిసి విద్యార్థి సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకట్ యాదవ్

Date : 17 July 2025 08:09 PM Views : 399

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 17 : స్థానిక అంబేద్కర్ భవనంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశంలో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకట్ యాదవ్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన బీసీలకు సముచిత న్యాయం కల్పించడం లేదని గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ బీసీలపై అవలంబిస్తున్న తీరు మాత్రం ఒకే విధంగా ఉందని ఈ రాష్ట్రంలోని బీసీ సమాజం,బీసీ యువత,బిసి ప్రజలు గమనించాలి. ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి ప్రధాన హామీలో భాగంగా నామినేటెడ్ పదవులు ల లో బీసీలకు సమచిక న్యాయం కల్పిస్తామని 50%నుండి 60% కేటా ఇస్తామని ప్రధాన హామీగా బీసీలకు అధికారంలో లేనప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవలంబిస్తున్న తీరును చూస్తూ ఉంటే పూర్తిగా ఆశ్చర్యం. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గo లో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం చైర్మన్ పదవి బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని ఈ బీసీ ఐక్య సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం.తెలుగు రాష్ట్రాల నుండి కాక, పక్కనే ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక రాష్ట్రం నుండి ప్రతినిత్యం దాదాపు లక్షలాదిమంది భక్తులు శ్రీ బోయకొండ గంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇలాంటి ప్రఖ్యాతగాంచినటువంటి శ్రీ శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం వెలసినప్పటినుండి, పూర్వం నుండి ఇప్పటి వరకు కూడా అక్కడ శ్రీ బోయకొండ గంగమ్మ తల్లికి బీసీ సామాజిక వర్గానికి చెందినవారు అమ్మవారికి ప్రతినిత్యం సేవలు చేస్తున్నారు, శ్రీ బోయ కొండ గంగమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటైనప్పటినుండి ఇంతవరకు ఏ ఒక్క బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కి కూడా చైర్మన్ కేటాయించకపోవడం చూస్తా ఉంటే ఈ పుంగనూరు నియోజకవర్గంలో బీసీ సమాజం, బీసీ ప్రజలు ఎంత అణచివేతకు గురవుతున్నారని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం గమనించాలి. గతంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కా వచ్చు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కావచ్చు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీలో కూడా ఈ బోయకొండ ఆలయ చైర్మన్ పదవి పెత్తందారులకు, ఒకే సామాజిక వర్గానికి,ఒకే కులానికి,ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు అనేకసార్లు చైర్మన్ పదవి కేటాయించడం బీసీ సంఘాల తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న బీసీ ఓట్లు కీలకం, కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి, మానవతా దృక్పథంతో బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ పదవి బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాo, మనం చూసినట్లయితే బోయకొండ చైర్మన్ బీసీలకు కేటాయించాలని బిసి ఉద్యమ నాయకులు బోయకొండ రెవిన్యూ పంచాయతీకి చెందినటువంటి గంపల గంగరాజు గారు దాదాపు 15 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 500 మంది బిసి ఉద్యమకారుల తో,బీసీ సంఘాలతో నాయకులు తో కలిసి పుంగనూరు నుండి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం వరకు ఆయన పాదయాత్ర కూడా చేయడం జరిగింది. ఇలాంటి బీసీ ఉద్యమాలను బీసీ ఉద్యమకారులను కూడా ఈ ప్రభుత్వం గమనించి త్వరలో విడుదల కానున్న ఆలయ కమిటీ చైర్మన్ పదవి బీసీలకు కేటాయించి బీసీలకు న్యాయం చేయాలని మరొకసారి బీసీ ఐక్య సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :