Thursday, 16 April 2026 06:51:42 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

తంబల్లపల్లె లో ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

Date : 07 July 2024 06:37 PM Views : 393

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 7 : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాదిగ జాతి అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ జాతికే మణిరత్నమని ఎమ్మార్పీఎస్ తంబళ్లపల్లె ఇంచార్జ్ వేటా మల్లికార్జున, పెద్దమండెం ఇంచార్జ్ వెంకటప్ప, మండల అధ్యక్షుడు భాస్కర్ లు కొనియాడారు. ఆదివారం తంబళ్లపల్లి క్రాస్ రోడ్ లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం తో పాటు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఎంఆర్పిఎస్ నాయకులు ఘనంగా నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా పతాకావిష్కరణ తో పాటు భారీ కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనకు మందకృష్ణ మాదిగ చేస్తున్న కృషి అనర్వచనీయమని వర్గీకరణ సాధించేంతవరకు విశ్రమించేది లేదన్నారు. టిడిపి మహిళా నాయకురాలు సిద్ధమ్మ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఆవిర్భావం ఓ చరిత్ర అని స్థాపించిన మందకృష్ణ మాదిగ జాతికే వన్నె తెచ్చారని ఆయన తన జాతి అభివృద్ధితోపాటు దివ్యాంగులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు ఎంఆర్పిఎస్ జిందాబాద్, మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ జగదీష్, భాను ప్రకాష్,బొజ్జప్ప, గంగాధర్, శివమణి, చెన్న కృష్ణ, రమణ, టిడిపి నాయకులు ఉత్తమ రెడ్డి, రామచంద్ర, చలపతి నాయుడు, రెడ్డప్ప లు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :