నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జులై 3 : రామసముద్రం మండలం లోని తిరుమలరెడ్డిపల్లె, దిగువపేట, ఎగువపేట, నడింపల్లె గ్రామాల్లో నేడు ఏడ వరోజు గురువారం హస్సేన్, హుస్సేన్ ప్రత్యేక సదివింపులు చేసి భక్తి శ్రద్ధలతో మొహరం వేడుకలు జరుపుకున్నారు.పీర్ల చావడిని పచ్చని తోరణాలు, విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు.రాత్రి గంధపు ఫీర్ల కు బాబయ్య లకు మట్టి కుండలో పానకం సమర్పించి మొక్కులు చెల్లించుకొనున్న మండల కేంద్రంలోను మొహరం జరిగే గ్రామాల్లో ఫీర్లకు బాబయ్య లకు షేరాలు కట్టి భక్తులు చెక్కర, బెల్లం బొరుగులు సదివింపులు చేసి,హస్సేన్, హుస్సేన్ నులకు చెక్కర, బూందీ చదివింపులు చేసి అందరికి పంచిపెట్టారు. రాత్రి గ్రామాల్లో ఫీర్ల ఊరేగింపు చేశారు. ఈవేడుకలు తిలకించడానికి మండలంలోని ప్రజలేకాకుండా ఇతర జిల్లాలే కాక కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Namitha News