Thursday, 16 April 2026 07:00:25 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మానవత సంస్థ సేవలను కొనియాడిన మంత్రి సోదరుడు

ఫ్రీజర్ బాక్స్ వితరణ చేస్తానని హామీ ఇచ్చిన మండిపల్లి రాహుల్ రెడ్డి

Date : 28 July 2024 03:14 PM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి : జూలై28 : ఆపద సమయాలలో సహాయం కొరకు ప్రతి ఒక్కరికి గుర్తుచ్చే సంస్థ మానవత సంస్థ *సమయం కేటాయించి నిస్పక్షపాతంగా సేవలు అందించుచున్న మానవత సంస్థ కుటుంబ సభ్యులకు ప్రత్యెక కృతజ్ఞతలు* ఫ్రీజర్ బాక్స్ వితరణ చేయలని తమను గతంలోనే కోరిన పెద్దలు లోకనాధ రెడ్డి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మానవత సంస్థకు ఫ్రీజర్ బాక్స్ వితరణ చేయున్నట్లు తెలియజేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు టిడిపి యువనేత మండిపల్లి రాహుల్ రెడ్డి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సహకారంతో ఎలక్ట్రికల్ స్మశాన వాటిక కొరకు కావాల్సిన స్థలానికి కృషి చేస్తాం మానవత నెలవారీ సమావేశంలో అతిదిలుగా హాజరైన టిడిపి యువనేత మండిపల్లి రాహుల్ రెడ్డి,మున్సిపల్ కమీషనర్ వాసు బాబు ,యునియన్ బ్యాన్ బంగ్లా బ్రాంచ్ మేనేజర్ ప్రసాద్ ,చార్మినార్ హోటల్ యజమాని సయ్యద్ ఫయాజ్ అతిదిలుగా హాజరైన వారిని ఘనంగా సన్మానించి మానవత మేమొంటో లను అందజేసిన మానవత కుటుంబ సభ్యులు కుల,మత బేధాభిప్రాయాలు లేకుండా ఆపదలలో సహాయం కోరిన వారికీ నిష్పక్ష పాతంగా సేవలందిచేందుకు కృషి చేస్తున్న మానవత సంస్థ వ్యవస్థాపకులకు,అందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యెకమైనటువంటి అభినందలు తెలియజేశారు టిడిపి యువనేత మండిపల్లి రాహుల్ రెడ్డి,మున్సిపల్ కమీషనర్ వాసు బాబు ,యునియన్ బ్యాన్ బంగ్లా బ్రాంచ్ మేనేజర్ ప్రసాద్ ,చార్మినార్ హోటల్ యజమాని సయ్యద్ ఫయాజ్ లు.రాయచోటి పట్టణం కోత్తపేట ప్రతిభా జూనియర్ కలశాల నందు మానవత అధ్యక్షులు ఖాదర్ బాష,సెక్రెటరి అంకం జయచంద్ర రెడ్డి,ట్రేజరర్ మురళి మోహన్ అధ్యక్షతన మానవత నెలవారీ సమావేశం ను నిర్వహించారు.ఈ సమావేశానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు టిడిపి యువనేత మండిపల్లి రాహుల్ రెడ్డి తో పాటు మున్సిపల్ కమీషనర్ వాసు బాబు ,యునియన్ బ్యాంక్ బంగ్లా బ్రాంచ్ మేనేజర్ ప్రసాద్ ,చార్మినార్ హోటల్ యజమాని సయ్యద్ ఫయాజ్ లు హాజరయ్యారు.అతిదులగా హాజరైన వారికి రాయచోటి మానవత శాఖ చైర్మన్ అరమాటి శివగంగి రెడ్డి ,కేంద్ర కమిటి సభ్యులు సహదేవ రెడ్డి,మాజీ అధ్యక్షులు చింతం రెడ్డి వెంకట్రామి రెడ్డి ,గౌరవ అధ్యక్షులు వెంకటరమణ లు ఘన స్వాగతం పలికారు.మానవత సంస్థను 2004 లో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో రిటైర్డ్ లేక్చరర్ యన్ రామచంద్ర రెడ్డి గారు ప్రారంబించి అనేక రకాలైన సేవలు అందజేయడం జరుగుతుందన్నారు.రాయచోటి లో 2014 లో మానవత సంస్థ కమిటి ఏర్పాటు చేసినప్పటి నుండి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు మానవత సంస్థ పెద్దలు అతిధిలకు వివరించారు.ఈ సందర్బంగా అతిధిలు మాట్లాడుతూ మానవత సంస్థ అందించుచున్నసేవలు అభినందనియమం అన్నారు.సేవలకే పరిమితం కాకుండా విద్యార్థులకు నైతిక విలువల పట్ల అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం తో పాటు ఉత్తమ విద్యార్థులను గుర్తించి వారిని ప్రోత్సహించడం అభినందదగ్గ విషయమన్నారు.పర్యావరణాన్ని పెంపొందించేలా మొక్కలు నాటడం వాటిని సంరక్షించేలా చర్యలు చేపట్టడం చాల హర్శనియమన్నారు.మానవత సంస్థ ద్వారా 11 ఫ్రీజర్ బాక్స్ లు ,రెండు శాంతి రథాలు తో పాటు అంబులెన్స్ ద్వారా అవసరం ఉన్నవారికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలు అందేలా కృషి చేస్తున్న దాతలకు మానవత సభ్యులకు మనస్పూర్తిగా వారు అభినందించారు.భవిష్యత్తులో మానవత సంస్థ ద్వారా సేవలు చేసేందుకు తమవంతు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని వారి తెలియజేసారు.ఫ్రీజర్ బాక్స్ వితరణ చేయలని తమను గతంలోనే పెద్దలు లోకనాధ రెడ్డి గారు కోరారని,తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఫ్రీజర్ బాక్స్ ను వితరణ చేస్తానన్నారు టిడిపి యువనేత మండిపల్లి రాహుల్ రెడ్డి.అదే విదంగా జిల్లా కేంద్రం అయినటువంటి రాయచోటి లో ఎలక్ట్రికల్ స్మశాన వాటిక కొరకు స్థలం కేటాయించాలని కోరారని మంత్రి సహకరంతో సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.తమ విన్నపానికి సానుకూలంగా స్పందించి స్థలం కొరకు కృషి చేస్తానన్న టిడిపి యువనేత మండిపల్లి రాహుల్ రెడ్డి ,మున్సిపల్ కమీషనర్ వాసు బాబు గారికి ప్రత్యెక ధన్యవాదాలు తెలియజేశారు.అనంతరం అతిదిలను దుస్సాలవతో ఘనంగా సన్మానించి మానవత జ్ఞాపికలను అందజేశారు.ఈ కార్యక్రమలో మానవత కుటుంబ సభ్యులు తో పాటు ,నరేష్ ,రెడ్డప్ప ,శ్రీను ,సూరి ,రోటరీ క్లబ్ సభ్యులు హాజరయ్యారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :