నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఏప్రిల్ 3 : అభం శుభం తెలియని దివ్యాంగ పిల్లల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జ్ ఉమర్ ఫరూక్ సూచించారు. గురువారం ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు లీగల్ అవేర్నెస్ క్యాంప్ లో భాగంగా స్థానిక భవిత దివ్యాంగుల కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల మౌలిక వసతులు, వారికి అందించే విద్యా బోధన, సిబ్బంది పనితీరు పై పరిశీలించారు. భవిత కేంద్ర పనితీరు పై దివ్యంగా పిల్లల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగ పిల్లలకు వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం అందించే మౌలిక వసతులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి త్యాగరాజు, సివిల్ కోర్టు సిబ్బంది ఐ.ఈ ఉపాధ్యాయులు రేఖ, శ్రావణి, ఫిజియోథెరపీ సరళ, కేర్ టేకర్ నాగరత్నమ్మ, సిఆర్పి సుధాకర్ దివ్యాంగుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Reporter
Namitha News