నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నమిత న్యూస్ - మదనపల్లి జనవరి 5: పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని.. ప్రజలందరూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్, ఎమ్మెల్యే నవాజ్ భాష తెలిపారు. మదనపల్లి జడ్పీ హైస్కూల్లో వైయస్సార్ పెన్షన్ కానుక కింద పెంచిన పింఛన్లను మరియు కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి.యస్. గిరీషా .... ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద అట్టడుగు వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. జనవరి 1 నుంచి రూ 3 వేలకు పెంచిన పింఛన్లను అర్హులకు పంపిణీ చేస్తున్నాం. ఒక్క మదనపల్లి మండలం మున్సిపల్ గ్రామీణ ప్రాంతంలో దాదాపు 25 వేల మందికి పైగా అవ్వ తాతలు వితంతువులు వికలాంగులకు రూ.3 వేలకు పెంచిన పింఛన్ అందజేయడం జరుగుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ లబ్ధి అందుతోంది. కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా 90 శాతం పథకాలు సచివాలయ ద్వారా అమలవుతున్నాయి. జగనన్న ఆరోగ్య సురక్ష జగనన్నకు చెబుదాం కార్యక్రమాల అమలు కొరకు జిల్లాలో ప్రతి ఇంటికి వెళ్లడం జరిగింది. ఇందులో వైద్య సేవలు అవసరమైన వారిని గుర్తించడంతోపాటు దాదాపు 2.50 లక్షల ఇళ్లకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందన్నారు. నాడు నేడు కార్యక్రమం కింద జిల్లాలో 3 వేల పాఠశాలలను అభివృద్ధి చేశాం. ప్రతి పేదవాడి పిల్లలు బాగా చదవాలనే ముఖ్యమంత్రి ఆశయం. ప్రజలందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. *మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ భాష* ... సి.యం. జగన్ తన పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసి, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను వందశాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే చరిత్ర సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుంది. గత ప్రభుత్వాలు మాటలకే పరిమితంగా ఉండేవి అమలు చేసేదిలేదు . ఈ ప్రభుత్వం లో మేనిఫెస్టోలో చెప్పినవి , చెప్పనవి కూడా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్. చెప్పిన మాట ప్రకారం 3 వేలకు పెంచిన పెన్షన్ ను అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు అందిస్తున్నాం. ప్రతి పేదవాడి జీవితాల్లో ముఖ్యమంత్రి వెలుగులు నింపారు. గడపగడపకు వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకొని సంక్షేమ పథకాలు అందజేశాం. గత 40 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా... రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ప్రజలకు సుపరిపాలనతో పాటు పారదర్శకంగా లంచాలకు , సిఫారసులకు తావు లేకుండా నేరుగా ముఖ్యమంత్రి జమ చేశారు. మదనపల్లి మున్సిపాలిటీలో 15 వేల మందికి ఇల్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటి నిర్మాణానికి రూ. 1.80 లక్షలు మంజూరు చేశారు. అలాగే దాదాపు నాలుగు, ఐదు లక్షల విలువ చేసే ఇంటి స్థలం ఇచ్చాం. పేద ప్రజల పక్షాన అండగా నిలబడుతున్న ప్రభుత్వానికి ప్రజలు ఆశీర్వాదం అందించాలని మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రి ని చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు .. అనంతరం వైయస్సార్ పెన్షన్ కానుక కింద మదనపల్లి పట్టణ పరిధిలోని 11304 మంది లబ్ధిదారులకు రూ.3,41,80,000లు, గ్రామీణ ప్రాంతంలోని 14166 మంది లబ్ధిదారులకు రూ.4.12కోట్ల విలువైన మెగా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మైనార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ షమీం అస్లాం, చిన్న మధ్యతరహా పరిశ్రమల స్టేట్ డైరెక్టర్ ఆనంద సాగర్, మున్సిపల్ వైస్ చైర్మన్లు జింకా చలపతి, నూర్ ఆజాం, ఎంపీపీ చందన రెడ్డమ్మ, ఆర్డీవో మురళి, డిఆర్డిఏ పిడి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తాసిల్దారు మహబూబ్ చాంద్, ఎంపీడీఓ, మున్సిపల్ కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News