నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 8 : తంబళ్లపల్లె మండలం కోసవారిపల్లె కు చెందిన గర్ని మిట్ట కృష్ణమూర్తి కుమారుడు గర్ని మిట్ట నాగేష్ చిన్న వయసులోనే అనారోగ్యంతో మృతి చెందడం విచారకరమని ఆ కుటుంబానికి తీరనిలోటని తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జ్ జయ చంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని పోషించాల్సిన కన్న కొడుకు మృతి సంఘటన పగవాడికి కూడా రాకూడదని విచారం వ్యక్తం చేశారు. అనంతరం నగేష్ మృతికి సంతాపం ప్రకటించి ఆయన తండ్రి కృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, మండల రెడ్ల సంఘం అధ్యక్షుడు తరుగు శివారెడ్డి, బేరి శ్రీనివాసులు, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, మంజునాథ్ రెడ్డి, బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కె.వి.రమణ, మాజీ సర్పంచ్ ఎర్రగుడి సురేష్, సురేంద్ర నాయుడు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Namitha News