నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జనవరి 30 : మదనపల్లె సమీపం లోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) సహకారంతో యూనిటీ 3D గేమ్ డెవలప్‌మెంట్‌పై సమగ్ర వర్క్‌షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు, అధ్యాపకులు మరియు పరిశ్రమ నిపుణులు చురుకుగా ఈ కార్యక్రమం పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఇంటరాక్టివ్ 3D వాతావరణాలు మరియు గేమ్ అభివృద్ధి రంగంలో నైపుణ్య అభివృద్ధి వైపు మళించడానికి ఇది ఒక మంచి అవకాశం అని అన్నారు. వీడియో గేమ్‌లు, సిమ్యులేషన్‌లు మరియు వర్చువల్/ఆగ్మెంటెడ్ రియాలిటీ అనుభవాల కోసం లీనమయ్యే 3D వాతావరణాలను సృష్టించడంపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని ఆయన అన్నారు. ఈ వర్క్‌షాప్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) నుండి రిసోర్స్ పర్సన్లు, ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ ప్రోగ్రామ్స్ మిస్టర్ ఏం గౌస్‌పీర్ మరియు ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ ప్రోగ్రామ్స్ సి. సతీష్ కుమార్ లు వ్యవహరించారని, కళాశాల యాజమాన్యం తరుపున వారికీ కృతజ్ఞతలు తెలియజేసారు. బహుళ ప్లాట్‌ఫారమ్‌లలో 3D ప్రపంచాలను రూపొందించడానికి, యానిమేట్ చేయడానికి మరియు ఆప్టిమైజ్ చేయడానికి యూనిటీ యొక్క శక్తివంతమైన గేమ్ ఇంజిన్ మరియు సి యాష్(C#) స్క్రిప్టింగ్‌ను ఉపయోగించి అప్లికేషన్స్ ను చేయిచడం జరిగింది. కార్యక్రమం లో డాక్టర్ పి రామనాథన్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CST) విభాగాధిపతి డాక్టర్ కె దినేష్, సమన్వయకర్త-SDC డాక్టర్ వి బి తురై రాజ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం (CSE) విభాగాధిపతి డాక్టర్ శ్రీ దేవి, అధ్యాపకులు పాల్గొన్నారు.
Admin
Namitha News