నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - అక్టోబర్ 28 : మదనపల్లి రెడ్డి సంక్షేమ సంఘం న్యాయసలహాదారులు, మదనపల్లి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన ఆవుల శివరామి రెడ్డి అకాల మరణం వారి కుటుంబానికి, మరియు మదనపల్లి పట్టణ ప్రజలకు తీరని లోటని రెడ్డి సాహెబ్ అన్నారు. మదనపల్లి పట్టణ ప్రజలకు మరియు రెడ్డి సంక్షేమ సంఘానికి ఆయన ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన న్యాయవాదిగా 51 సంవత్సరాలు సుదీర్ఘకాలం పనిచేస్తూ పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా ఆయన పనిచేశారని గుర్తుచేశారు. ఆయన అకాలమరణం వారి కుటుంబానికి తీరని లోటని తెలిపారు. ఆవుల శివరామిరెడ్డి భౌతికంగా మన మధ్య లేకున్నా వారు ప్రజలతో గడిపిన క్షణాలు ఎల్లప్పుడూ మన వెంటే ఉంటాయని వారి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని రెడ్డి సాహెబ్ తెలిపారు.
Admin
Namitha News