నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 14 : తంబళ్లపల్లె మండలం లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో తో పాటు ప్రాథమిక, ప్రాథమికోన్నత, గురుకుల, మోడల్ స్కూల్ లో పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు పంపిణీ పూర్తయినట్లు ఎంఈఓ త్యాగరాజు, ఎంఈఓ 2 నాగ సుబ్బరాయుడులు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు పంపిణీ జరిగిందని మరో రెండు రోజుల్లో స్టూడెంట్ కిట్ లు సైతం పంపిణీ జరుగుతుంది అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థులు చేర్పించడానికి స్థానికంగా గల ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు సహకారంతో విశేష కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించడానికి వారి తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాల కు రప్పించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతోపాటు సౌకర్యాలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం తదితర అంశాలను విద్యార్థుల తల్లిదండ్రుల కు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఎం ఆర్ సి లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Admin
Namitha News