నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పౌరహక్కులపై ప్రజల అవగాహన పెంచుకోవాలని తహశీల్దార్ మహమ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్సి కాలనీలో అధికారులతో కలిసి సివిల్ రైట్స్ డేని నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుడికి కొన్ని హక్కులను రూపొందించమని, వాటిని స్వచ్ఛందంగా వినియోగించు కోవచ్చునన్నారు. సమాజంలో కుల, మత, తారతమ్యాలు చూపించకూడదని అన్నారు. పౌరులు స్వేచ్ఛగా జీవించడానికి భారత రాజ్యాంగం ఆర్టికల్స్ ద్వారా కొన్ని హక్కులను ఏర్పాటు చేసిందన్నారు. పౌరుహక్కులకు ఎవరైనా భంగం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో పౌరహక్కులపై అవగాహన కల్పిస్తున్న తహశీల్దార్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రజలు ప్రశాంత వాతావరణం జీవించాల న్నారు. కార్యక్రమంలో ఎంఇఒ భువనేశ్వరాచారి, కానిస్టేబుల్ వెంకటరమణ, విఆర్ ఒలు పాల్గొన్నారు.
Admin
Namitha News