నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఆగస్టు 24 : రామసముద్రం మండలం ఊలపాడు గ్రామపంచాయతీ నరసాపురం గ్రామానికి చెందిన వినోద్ బెస్ట్ బిజినెస్ ఐ కానిక్ అవార్డు ఆదివారం అందుకున్నారు. ఆయన చరవాణి లో మాట్లాడుతూ మాది రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన వాడినని మాది మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అని మా అమ్మ, నాన్న వ్యవసాయం పై ఆధారపడి జీవించామన్నారు. నా విద్యాబ్యాసం రామసముద్రంలో 10 నుండి ఇంటర్ వరకు చదివానని డిగ్రీ తిరుపతి ఎంబిఏ బెంగళూరులో అభ్యసించానని ఆయన తెలిపారు. మండల అభివృద్ధికి ప్రణాళికలు రూపు దిద్దుతున్ననన్నారు అన్ని విషయాలు త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
Admin
Namitha News