Thursday, 16 April 2026 06:56:50 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

దిగువ ముట్రవారి పల్లె అగ్ని కి ఆహుతైన మూడు ఎకరాల మామిడి తోట

చేతికి వచ్చిన తోట దగ్ధం , లక్షల్లో నష్టం తో అచేతనంగా అమరావతి , రఘునాథ రెడ్డి దంపతులు

Date : 11 March 2025 10:55 PM Views : 375

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మార్చి 11 ః గుర్తుకు తెలియని దుండగులు నిండు పూత తో నున్న మామిడి తోటకు నిప్పు పెట్టడంతో దగ్ధమై సుమారు లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగిన దురదృష్టకర సంఘటన మండలంలో చోటుచేసుకుంది. కోసువారిపల్లె పంచాయతీ దిగువ ముట్రవారిపల్లెకు చెందిన రైతు రఘునాథరెడ్డి, అమరావతి లకు చెందిన మూడు ఎకరాల మామిడి తోట ఫలసాయంతో జీవనోపాధి. ఈ ఏడాది సైతం మామిడి తోటకు అప్పులు చేసి ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటంతో ఆశించిన స్థాయిలో పూత పూయడంతో ఆ రైతు కుటుంబం ఈ ఏడాది వచ్చే ఆదాయంతో కష్ట , నష్టాల నుండి గట్టెక్కవచ్చునని సంతోషించారు. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో మామిడి తోట పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న రఘునాథరెడ్డి, అమరావతిలు తోటను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. నోటికి వచ్చిన పంట దగ్ధమవడంపై చేసిన అప్పులు ఎలా తీర్చాలి రా దేవుడా అంటూ రోదించారు. ఈ విషయమై తంబళ్లపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దశాబ్దాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్న మామిడి తోట కాలి బూడిదవడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ మామిడి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :