నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 18 ( నేటి మన దేశం ప్రతినిధి) తంబళ్లపల్లె మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పౌర సరఫరాల గోడౌన్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆకస్మిక తనిఖీ చేశారు. గోడౌన్ నిర్మాణ పనులను పరిశీలించి గోడౌన్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎదురుగా ఉన్న ప్రస్తుతం పౌర సరఫరాల గోడౌన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించి గోడౌన్ కు సంబంధించిన పలు రకాల రిజిస్టర్ లను పరిశీలించారు. అనంతరం గోడౌన్ లోని నిత్యవసర సరుకుల నాణ్యతను పరిశీలించి పలు సలహాలు సూచనలు చేశారు. తదుపరి తాసిల్దార్ కార్యాలయం చేరుకొని కార్యాలయ దుస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాసిల్దార్ కార్యాలయం తాత్కాలికంగా పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ కు తరలించినట్లు తాసిల్దార్ హరి ప్రసాద్ తెలిపారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శివరాం, తాసిల్దార్ హరిప్రసాద్, రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు పాల్గొన్నారు.
Reporter
Namitha News