నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మత సామరస్యానికి దర్పణం పట్టే అతిపెద్ద ఉరుసులలో కలిచర్ల హజరత్ యూసుఫుల్లా మహమ్మద్ దర్గా ఉరుసు ఉత్సవం -- కలిచర్ల హజరత్ యూసుఫుల్లా మహమ్మద్ దర్గా ఉరుసు ఉత్సవంలో పాల్గొన్న వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్... మత ప్రార్థనలకు ప్రసిద్ధి చెందిన కలిచర్ల హజరత్ యూసుఫుల్లా మహమ్మద్ దర్గా ఉరుసు వేడుకలలో మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పాల్గొన్నారు. దర్గా మత పెద్దల ఆహ్వానం మేరకు సోమవారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలలో నిస్సార్ అహమ్మద్ పాల్గొన్నారు. నిస్సార్ అహమ్మద్ ఈ సందర్భంగా సాహెబ్ యూసుఫ్ హుస్సేనీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ మత సామరస్యానికి దర్పణం పట్టే అతిపెద్ద ఉరుసులలో కలిచర్ల హజరత్ యూసుఫుల్లా మహమ్మద్ దర్గా ఉరుసు ఉత్సవం ఒకటిగా నిలుస్తుందని నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఫాతేహాలు చేసి, ఛాదర్ సమర్పించి తమ భక్తి చాటుకోవడం ఆనవాయితీ అన్నారు. మదనపల్లె, తంబళ్లపల్లె నుంచే కాకుండా కదిరి, రాయచోటి, పుంగనూరు, పీలేరు ప్రాంతాల నుండి వచ్చి దర్గాలో ప్రార్థనలు చేసి తమ విశ్వాసం చాటుకుంటారని అన్నారు. విశ్వనాథ్ రెడ్డి, రమణా రెడ్డి, కేశవ్ రెడ్డి, మధు, ఎస్.రషీదా, రెడ్డెప్ప, తిరుపాల్ నాయక్, రఘు, యూనస్, సాదిక్, అబ్దుల్లా, యాసిన్, ఇతర తంబళ్లపల్లె వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News