Thursday, 16 April 2026 04:51:51 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియ ను వేగవంతం చేయండి - డి.ఈ.ఓ శివప్రకాష్ రెడ్డి

Date : 07 August 2024 04:17 PM Views : 350

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి: నమిత న్యూస్: ఆగస్టు 7 :-ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం రాయచోటి పట్టణంలోని డైట్ స్కూల్ హాల్లో అన్నమయ్య జిల్లా ఓపెన్ స్కూల్ ఏఐ కోఆర్డినేటర్ల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ పరీక్షల ద్వారా 14 సంవత్సరాలు వారు చదవగలిగిన,వ్రాయగలిగిన,పదవ తరగతి ఫెయిల్ అయిన,చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి చదువుకునే అవకాశం ఉందన్నారు.అలాగే ఇంటర్ చదువుకోవాలనుకున్న వారు 15 సంవత్సరాలు నిండిన,ఇంటర్ ఫెయిల్ అయిన మధ్యలో చదువు మానేసిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం ఉందన్నారు.ఓపెన్ స్కూల్ అనేది సరళమైన సార్వత్రిక విద్యా విధానం ద్వారా మహిళలు వృత్తి విద్యా కోర్సుల్లో పూర్తి కోర్సుల్లో ఉండేవారు రాజకీయ నాయకులు పలు రంగాలలో పనిచేసే వారు,వివిధ సంఘాలలో పనిచేసే వారు, సామాజికంగా ఆర్థికంగా వెలుగు బడిన వారికి ఈ ఓపెన్ స్కూల్ పరీక్షలు అనేవి ఒక గొప్ప సదవకాశం అని ఆయన అన్నారు.అనంతరం ఓపెన్ స్కూల్స్ రాష్ట్ర పరిశీలకుల అక్బర్ అలీ మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ చదివేవారికి సెలవు దినాల్లో తరగతులు ఉంటాయని,ప్రభుత్వమే సరళమైన భాషలో స్వీయ బోధన కోసం తయారుచేసిన పుస్తకాలు అందజేయబడతాయన్నారు.అలాగే మహిళలు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు,దివ్యాంగులతో పాటు మాజీ సైనిక ఉద్యోగులకు అడ్మిషన్ ఫీజులో రాయితీ ఉంటుందన్నారు.అభ్యాసకులు ఓపెన్ స్కూల్లో ప్రవేశం పొందినప్పటి నుండి ఐదు సంవత్సరాల లోపు తొమ్మిది పర్యాయాలు పరీక్షలకు హాజరయ్యే సౌలభ్యం ఉందన్నారు.అనంతరం అన్నమయ్య జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ కొండూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఓపెన్ స్కూల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 లతో పాటు అడ్మిషన్ ఫీజు జనరల్ కేటగిరి అభ్యర్థులకు రూ.1400 లు,మహిళలు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు,మాజీ సైనిక ఉద్యోగులకు రూ.900 ఉంటుందన్నారు.అలాగే అడ్మిషన్ ఫీజు రాయితీ పొందే వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అప్లికేషన్ లో అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. పరీక్షకు హాజరయ్యే వారికి ప్రతి సబ్జెక్టుకు రూ.100 పరీక్ష ఫీజు ఉంటుందని,దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష ఫీజులో రాయితీ ఉంటుందన్నారు.అనంతరం ఐఈడి కో ఆర్డినేటర్ జనార్దన్ మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ పరీక్షల లో క్రెడిట్ ఆక్యుములేషన్ పరీక్ష విధానం ఉంటుందన్నారు.పరీక్షకు హాజరయ్యే అభ్యాసకులు వారి సౌలభ్యం మేరకు ఒక సబ్జెక్టు లేక రెండు సబ్జెక్టులు పరీక్షకు హాజరు కావచ్చునని,వారికి ఇచ్చిన ఐదు సంవత్సరాల గడువులోపు అన్ని సబ్జెక్టులు పాసైన వెంటనే సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందన్నారు. పరీక్షలు సంవత్సరంలో రెండు పర్యాయాలు ఉంటాయని మార్చి,ఏప్రిల్ లో ఒకసారి,జూన్,జూలై మాసాలలో రెండవసారి జరుగుతాయన్నారు.కావున అభ్యాసకులు ఓపెన్ స్కూల్ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.అనంతరం డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో మంది చదువు మధ్యలో మానేసిన వారికి,పాఠశాలలకు వెళ్లి చదువుకునే అవకాశం లేని వారికి,ఇతర వృత్తులలో ఉన్న వారికి,వివిధ సంఘాలలో పనిచేసే వారికి,ఇంటి వద్ద నుండి చదువుకునే వారికి,సెలవులలో చదువుకునే వారికి ఈ ఓపెన్ స్కూల్ పరీక్షలు అనేవి చాలా ఉపయోగపడతాయన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :