నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి గా నాగరాజు, ఝాన్సీ రాణి మదనపల్లి సెప్టెంబర్ 10, (మణి నమిత న్యూస్ విలేఖరి ) : ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు రాష్ట్రం లోని అన్ని జిల్లాల స్కూల్ గేమ్స్ కార్యదర్శుల నియామక పత్రాన్ని రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ విజయరామరాజు నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు అన్నమయ్య జిల్లా విద్యా శాఖ అధికారి కె. సుబ్రమణ్యం తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం సిటిఎం జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు వై నాగరాజు, కలకడ మండలం కోన జిల్లా పరిషత్ హైస్కూల్ లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయురాలు ఝాన్సీరాణిని ఎంపిక చేసి ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె. సుబ్రహ్మణ్యం తెలిపారు. వీరు పాఠశాల క్రీడా సమాఖ్య కు సంబంధించిన అండర్ 14, అండర్ 17 విభాగాల బాల బాలికల క్రీడల నిర్వహణ లో, జట్ల ఎంపిక, స్కూల్ గేమ్స్ లో పాల్గొనే విధంగా తమ విధులు నిర్వర్తిస్తారని తెలియ జేశారు. మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలికల భద్రత సంరక్షణ దృశ్య క్రీడలలో పాల్గొన్నప్పుడు మహిళల స్కూల్ గేమ్స్ కార్యదర్శిని నియమించి వారి భద్రతకు ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇస్తూ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకునే చర్యలో భాగంగా మహిళా సెక్రటరీని నియమించడం జరిగిందని రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి బాను మూర్తి రాజు, కమిషనర్ విజయరామరాజు తెలియ జేశారు.
Reporter
Namitha News