Thursday, 16 April 2026 06:54:50 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

శక్తి, యుక్తులకు ప్రతీకగా కీర్తించే హనుమంతుడు సకల శుభములు కలిగిస్తాడు -- హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని సేవలో పాల్గొన్న వైసిపి సమన్వయకర్త నిస్సార్

Date : 22 May 2025 06:01 PM Views : 137

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వీర పరాక్రమాలు, వివేకం, శక్తి, యుక్తులకు ప్రతీకగా కీర్తించే హనుమంతుడు సకల శుభములు కలిగిస్తాడు -- హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని సేవలో పాల్గొన్న వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ -- కాట్లాటపల్లి రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారి పూజలు, అన్నదానంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ హనుమంతుడు బలం, ధైర్యం, భక్తి, నమ్మకానికి పెట్టింది పేరుగా వీరత్వం పరాక్రమానికి ప్రతీకగా, కార్యసాధనకు ప్రతిరూపంగా పూజలందుకుంటున్నాడని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా మదనపల్లె టౌన్‌ కాట్లటపల్లి రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్నారు. స్థానిక వైసిపి నాయకులు, ఆలయ కమిటీ వారు సాదర స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ‌అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నవితర గావించారు.‌ ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.‌హనుమంతుని గొప్పతనాన్ని వివరించారు.‌ హనుమంతుడు శ్రీరాముడి పట్ల అంతులేని భక్తితో వుండటం, సీతను రక్షించేందుకు చేసే ప్రతి పని వీరత్వానికి నిదర్శనం అన్నారు. హనుమంతుడు నమ్మకం మరియు పట్టుదల ద్వారా అసాధ్యమైన పనులను కూడా సాధించాడని ఇది అతని వీరత్వానికి ఒక ముఖ్యమైన లక్షణం‌ అన్నారు. హనుమంతుడు తన బలం, ధైర్యాన్ని తన వివేకంతో సమతుల్యం చేసి గొప్ప విజయం సాధించాడని కొనియాడారు. సేవకు నిలువెత్తు సాక్ష్యం హనుమంతుడు అని రామాయణ ఘట్టంలో హనుమంతుడి సేవ అమోఘం అని, రాముడిని గుండెలో పెట్లుకున్న అపర భక్తుడుగా నేటికి కిర్తీంచబడటం జరుగుతోందని, హనుమంతుడి ధైర్య వీరత్వం, మానవత్వం, బలం, జ్ఞానం, భక్తి వంటి లక్షణాలు అందరూ ఆచరించదగినవిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకట శివ, ఎన్‌వి. రమణా, శారదారెడ్డి, వైసిపి నాయకులు అనిల్, లక్ష్మీనారాయణ, నాగమణి, బండి మనోహర్, చిన్న, చరణ్, మహేష్, మల్లికార్జున రెడ్డి, యూనస్, శ్రీకాంత్, చిన్న తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :