నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 18 : తంబల్లపల్లె మండలం లో జరిగిన రెవిన్యూ గ్రామ సభల ద్వారా రైతుల నుండి 952 సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు తాసిల్దార్ హరిప్రసాద్ విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్రిమాకుల పల్లెలో 45 జుంజురపెంట లో 159 కొట్లపల్లి లో 73 ఎర్రసానిపల్లె లో 70 గంగిరెడ్డిపల్లిలో 128 కన్నె మడుగు లో 127 పంచాలమర్రి లో 80 కుక్క రాజు పల్లె లో 78 రేణుమాకులపల్లి లో 102 మొత్తం 952 సమస్యలు వచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ సభలలో జాయింట్ భూముల సమస్యలు, భూ సవరణలు, ముటేషన్, సర్వేలో సబ్ డివిజన్, పేర్లు మార్పులు, ఖాతాదారుల పేర్లు మార్పు, చనిపోయిన వారి పాస్బుక్కులు మార్పు తదితర సమస్యలు వచ్చాయని వీటిపై అధ్యయనం చేసి యుద్ధ ప్రాతిపదికన పరిష్కారానికి రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. రైతులు ఎలాంటి సమస్య వచ్చినా నా దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Reporter
Namitha News