నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 25 : రామసముద్రం మండలం లో దేవి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు గురువారం శాకాంబరి దేవి అలంకరణ లో అమ్మవారు భక్తులకు దర్శన మిచ్చారు. పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. మూడవ రోజు నవరాత్రి వేడుకలలో భాగంగా అమ్మవారిని చక్కగా పలు రకాల పుష్పాలతో అలంకరించి,ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించి భక్తాదులకు ప్రసాదాన్ని వితరణ చేశారు.గ్రామంలోని భక్తాదులు పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని వారు తమ మొక్కలను తీర్చుకున్నారు.ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న అర్చకులు కులశేఖర్ బటర్, మల్లిఖార్జున స్వామి,అనిల్ స్వామి, వి. కే. రాజు, శంకర స్వామి,శ్రీనివాస్ ఆచార్, బాబుస్వామి, గ్రామ పెద్దలు గ్రామస్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News