నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - అక్టోబర్ 28 ః తంబళ్లపల్లె మండలం లోని పోలీసులతో పాటు అన్ని శాఖల అధికారులు మొంథా తుఫాన్ సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొని సహకరించాలని తహశీల్దార్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మండలంలోని పలు ప్రాంతాలలో సుడిగాలి పర్యటనలో భాగంగా వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నీటి జలాశయాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండేలా సంబంధిత రెవిన్యూ, సచివాలయ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మారుమూల ప్రాంతాలలో అంటూ వ్యాధులు సోకే అవకాశాలు ఉన్నందున ముందస్తుగా వైద్య సిబ్బంది ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యంతో పాటు ఆరోగ్య సూత్రాలు బోధించాలన్నారు. తుఫాను ప్రభావంతో ఎక్కడైనా పంటల నష్టం ఏర్పడితే ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం నష్టపరిహారం పై నివేదికలు సిద్ధం చేయాలన్నారు. తుఫాన్ సహాయక చర్యలు చేపట్టడంలో అధికారి యంత్రాంగం చొరవ చూపాలని సూచించారు. ఆయన వెంట ఎస్సై ఉమామహేశ్వర్ రెడ్డి, వీఆర్వో నాగరాజు, రెవిన్యూ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News