నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బీసీల సంక్షేమం,అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా...ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి... - బోడెం రాజశేఖర్ ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం నియోజకవర్గంలోని బీసీల సంక్షేమం,అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా పేర్కొన్నారు.ఆదివారం బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బోడెం రాజశేఖర్ ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ఎమ్మెల్యేతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్,విజయభారతి హైస్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్.సేతు,జనసేన నాయకులు జంగాల శివరాం రాయల్,చేనేత విభాగం నాయకులు పురుం సహదేవ,నాగినేని గోవిందు,సి.రామలింగయ్య,చిన్నరెడ్డెప్ప, సత్యసాయి జిల్లా అధ్యక్షులు షబ్బీర్,రామాంజనేయులు,రామకృష్ణ,శీను,కరామత్ బాషా,సూరిబాబు,సి.చంద్రయ్య,నరసింహులు,బాలసుబ్రమణ్యం,రాజశేఖర్,వై.వి.శేఖర్ నాయుడు,లక్ష్మీనారాయణ,బత్తుల లక్ష్మీపతి,మేస్త్రి శ్రీనివాసులు,మహమ్మద్ అలీ,ఈశ్వరమ్మ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే జహా మాట్లాడుతూ బీసీలు ప్రస్తుతం అన్నిరంగాల్లో ముందుంజ వేస్తున్నారని ప్రశంసించారు.బీసీలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కొనియాడారు.అదేవిధంగా మంత్రిమండలిలో చోటుతోపాటు ఎమ్మెల్యే,ఎంపీ సీట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు.ప్రస్తుతం రాజకీయల్లో బీసీలు క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు.అర్హులైన బీసీలందరికీ ఇంటి పట్టాలు,సంక్షేమ పథకాలు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు కేటాయిస్తామన్నారు.బీసీల ఐక్యతకు బోడెం రాజశేఖర్ కృషిని ఆయన ప్రశంసించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ బీసీలను కలిసికట్టుగా ముందుకు నడిపించడంలో బోడెం రాజశేఖర్ సఫలీకృతులయ్యారన్నారు.బీసీలంతా ఏకతాటిపై నడిచి రాజ్యాధికారం సాకారం చేసుకోవాలన్నారు.బీసీల హక్కుల సాధనకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు.విజయభారతి పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్.సేతు మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా బీసీలకు సముచిస్థానం కల్పిస్తున్నారన్నారు.అటువంటి నాయకుడు ఎమ్మెల్యేగా ఉండడం సంతోషకరమన్నారు.అనంతరం బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు రాజశేఖర్ మాట్లాడుతూ బీసీల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు,బీసీ కుల బాంధవులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.భవిష్యత్తులో బీసీల శ్రేయస్సు నిర్విరామ కృషి చేస్తామని స్పష్టం చేశారు.అంతకుముందు బీసీ నాయకులతో కలిసి మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ వద్ద గల మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి శ్రీకృష్ణ కళ్యాణ మండపం వరకు పాదయాత్ర నిర్వహించారు.
Reporter
Namitha News